ఒక్కటై పోరాడుదాం! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఒక్కటై పోరాడుదాం!

ఒక్కటై పోరాడుదాం!

Written By news on Saturday, January 9, 2016 | 1/09/2016


ఒక్కటై పోరాడుదాం!
బాబు మోసాలపై వైఎస్సార్ సీీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు

 అనంతపురం రైతు భరోసా యాత్ర నుంచి సాక్షిప్రత్యేక ప్రతినిధి: ముఖ్యమంత్రి చంద్రబాబు  ఎన్నికలప్పుడు ఏ హామీలనైతే ఇచ్చారో ఆ హామీలన్నీ నెరవేర్చేలా ఆయనపై గట్టిగా ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రజలంతా ఒక్కటి కావాలని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. చంద్రబాబుకు బుద్ధిరావాలంటే అందరూ ఒక్కటై పోరాడాలని ఆయన కోరారు. నాలుగో విడత రైతు భరోసా యాత్రలో భాగంగా మూడో రోజున బత్తలపల్లి జంక్షన్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రైతుల, చేనేత కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు.

ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలన.. రైతులు ఆత్మహత్యలు చేసుకునే స్థితికి దిగజార్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలన గురించి మూడు ముక్కల్లో, మూడు మాటల్లో చెప్పాలంటే మోసం..మోసం..మోసం అని హర్షధ్వానాల మధ్య జగన్ అన్నారు. వివరాలు ఆయన మాటల్లోనే...

 ‘అనంత’లోనే 100కు పైగా రైతుల ఆత్మహత్యలు
 అనంతపురం జిల్లాలో ఇప్పటికే మూడు విడతల రైతు భరోసా యాత్రలు చేశా. ఇప్పుడు నాలుగో దఫా యాత్ర చేస్తున్నానంటే కారణం ఈ ఒక్క జిల్లాలోనే వంద మందికి పైగా మరణించారు. తన పాలనలో రైతులు ఎలా బతుకుతున్నారనేది చంద్రబాబుకు అర్థం కావాలని, చేనేతలు ఎలా జీవిస్తున్నారనేది అర్థం కావాలని ఈ యాత్ర చేస్తున్నా. ఎన్నికలప్పుడు ఇంట్లో ఎప్పుడు టీవీని ఆన్ చేసినా ఏ గోడపై రాతలు చూసినా ఒక్కటే కనిపించేవి.. ఆనాడు చంద్రబాబు మైక్ పట్టుకుని సభల్లో మాట్లాడింది కూడా ఒక్కడే. అదేమిటంటే.. రైతుల రుణాలు పూర్తిగా మాఫీ కావాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి..బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి. ఏ అడ్వర్టైజ్‌మెంట్ చూసినా ఈ మాటలే వినిపించేవి. గ్రామాల్లో పెద్దపెద్ద ఫ్లెక్సీలు కట్టి వాటికి లైట్లు పెట్టి ఇవే మాటలు ప్రదర్శించారు. డ్వాక్రా రుణాలన్నీ పూర్తిగా మాఫీ అవుతాయని ఆ ఫ్లెక్సీలపై కనిపించేవి. కానీ ఎన్నికల తర్వాత ఇవన్నీ అమలయ్యాయా అని ప్రశ్నిస్తున్నా.. (లేదు..లేదు..అనే కేరింతలు)

 బాబొచ్చాడు.. పంగనామాలు పెట్టాడు..
 ఈ రోజు డ్వాక్రా అక్కచెల్లెమ్మల దగ్గరికి వెళ్లి ఎలా ఉన్నారమ్మా అని అంటే ‘బాబు వచ్చాడన్నా.. గెలిచాడన్నా..మాకు మూడు పంగనామాలు పెట్టాడన్నా’  అని అంటున్నారు. చదువుకున్న పిల్లల దగ్గరకి వెళ్లి ఎలా ఉన్నారని ప్రశ్నిస్తే ‘బాబు వచ్చాడన్నా..ముఖ్యమంత్రి జాబులో కూర్చున్నాడన్నా.. కానీ మాకు మాత్రం పోస్టింగులు లేవన్నా’ అని అంటున్నారు. డీఎస్సీ పరీక్షలు రాసి ఏడాది దాటుతున్నా పోస్టింగులు ఇవ్వడం లేదని ఆ పిల్లలు వాపోతున్నారు అని జగన్ ఆవేదనగా అన్నారు. జాబు కావాలంటే బాబు రావాలని ఎన్నికలప్పుడు టీడీపీ నాయకులు, చంద్రబాబు స్వయంగా మైకులు పట్టుకుని ప్రచారం చేసుకున్నారు.

కానీ బాబు వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఇవ్వడమేమో కానీ ఉన్నవి పీకేస్తున్నారని అందరూ వాపోతున్నారు. ‘బాబొచ్చాడు..35 వేల మంది ఫీల్డ్ అసిస్టెంట్లను ఇంటికి పంపించాడు. బాబొచ్చాడు.. దాదాపు 40 వేల మంది ఆదర్శ రైతులను ఇంటికి పంపాడు. బాబొచ్చాడు.. 40 వేల మంది అంగన్‌వాడీ కార్మికులు సమ్మె చేస్తావున్నా పట్టించుకోని పరిస్థితుల్లో ఉన్నాడు’ అని జగన్ అన్నారు. బాబేమో ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాడు గానీ రాష్ట్రాన్ని దివాలా తీసే పరిస్థితుల్లోకి తీసుకెళ్లిపోయారు.

 ఇన్‌పుట్‌సబ్సిడీపై మాటమార్చిన సీఎం..
 ఎన్నికల సమయంలో 2013-14 సంవత్సరానికి సంబంధించిన ఇన్‌పుట్ సబ్సిడీని ఇస్తానని జిల్లాలన్నీ తిరిగి చంద్రబాబు హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి కాగానే జిల్లాల్లో రైతులందరినీ ఆదుకుంటా.. ఇన్‌పుట్ సబ్సిడీని ఇస్తా అని ప్రచారం చేసుకున్నారు. ముఖ్యమంత్రి అయ్యా క మాత్రం మాట మార్చారు. సాక్షాత్తూ అసెం బ్లీ వేదికగా 2013-14 ఇన్‌పుట్ సబ్సిడీని ఇవ్వ ను అని చెప్పి రైతుల నోట్లో మట్టి కొట్టారు. 2013-14 ఇన్‌పుట్ సబ్సిడీని రైతులకు ఇవ్వకపోగా 2014-15 ఇన్‌పుట్ సబ్సిడీని కూడా బాగా తగ్గించివేశారు. ఈ సంవత్సరంలో రూ.736 కోట్లు సబ్సిడీ ఇవ్వాల్సి ఉంటే రైతులకు మాత్రం రూ.224 కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారు.

2015-16 సంవత్సరానికి కరువు మండలాలను ప్రకటించండి. రైతులంతా అల్లాడిపోతున్నారు అని కోరితే చంద్రబాబు పట్టించుకున్న పాపానపోలేదు. చివరకు ఆయా జిల్లాలన్నీ తుపాను వచ్చి అతలాకుతలం అయిన తర్వాత వర్షాలు బాగా పడిన తర్వాత మరో 163 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించారు. వర్షాలు పడిన తర్వాత కరువు మండలాలు ప్రకటించిన ముఖ్యమంత్రి దేశంలో ఎవరైనా ఉన్నారూ అంటే అది చంద్రబాబే. అంతటి దారుణంగా చంద్రబాబు రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని అర్థమవుతోంది. రైతులతోనే కాదు చేనేత కార్మికుల జీవితాలతో కూడా తాను ఎలా చెలగాటమాడుతున్నాడో చంద్రబాబుకు అర్థం కావాలని మరణించిన వారి ప్రతి ఇంటికి మనం వెళ్తున్నాం.  ఆ కుటుంబీకులకు జరిగిన నష్టాన్ని ఎలుగెత్తిచాటుతున్నాం. చని పోయిన కుటుంబాలకు రూ.5 లక్షలు పరిహా రంగా ఇస్తామని ప్రకటించారు కదా ఇచ్చారా అని అడిగితే ఇవ్వలేదనే అన్ని చోట్లా చెబుతున్నారు. అలా చనిపోయిన వారి కుటుంబాల జీవితాలతో కూడా బాబు ఆడుకుంటున్నాడు.

 మూడో వంతు వడ్డీ కూడా మాఫీ కాలేదు..
 రుణమాఫీ కాదు కదా రైతుల రుణాలపై వడ్డీ కూడా మాఫీ కాలేదు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యే నాటికి రూ.87,612 కోట్ల మేర రైతులు బ్యాంకులకు చెల్లించాల్సిన వ్యవసాయ రుణాలు ఉన్నాయి. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన ఈ 20 నెలల్లో ఆ రుణాలపై 14 శాతం వడ్డీ పెరిగింది. రుణాలు చెల్లించవద్దంటూ చంద్రబాబు చెప్పిన మాటలు నమ్మి చెల్లించని నేరానికి ఈ రోజు ఆ రైతులపై ఈ అపరాధపు వడ్డీ భారం రూ.20 వేల కోట్లు పడింది. ఆ 20 వేల కోట్లను బ్యాంకులు వసూలు చేస్తామంటున్నాయి. అయితే రెండేళ్లకు కలిపి చంద్రబాబు రుణమాఫీ కింద ఇచ్చిన మొత్తం రూ.7,300 కోట్లు మాత్రమే.

అంటే వడ్డీలో మూడో వంతుకు కూడా సరిపోని విధంగా చంద్రబాబు గారి రుణమాఫీ పథకం అమలుజరుగుతోంది. ముఖ్యమంత్రి అయిన వెంటనే కొత్త ఇళ్లను కట్టిస్తామని బాబు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో గుడిసెలే లేకుండా చేస్తానన్నారు. ఇంటికో ఉద్యోగమన్నారు. ఉద్యోగం ఇవ్వకపోతే రూ.2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఎన్నికలప్పుడు మీరిచ్చిన హామీలేమిటి, ఇప్పుడు మీరు చేస్తున్నదేమిటి.. ఒక్కసారి మీ గుండెల మీద చేయి వేసుకుని ఆలోచించండి అని నేను అసెంబ్లీ సాక్షిగా ప్రశ్నించాను. రైతులు, చేనేత కార్మికుల జీవితాలను వారు ఆత్మహత్యలు చేసుకునే స్థితికి దిగజార్చారని చెప్పాను. నేనలా మాట్లాడినప్పుడు రాష్ట్రంలో రైతులంతా సుఖసంతోషాలతో ఉన్నారని, ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవడం లేదని చంద్రబాబు, టీడీపీ నాయకులు చెప్పా రు. అందుకే అలా చనిపోయిన వారి ప్రతి కుటుంబం వద్దకు నేను వెళ్తాను. అప్పటికైనా వారి కష్టాలు నీకు అర్థమవుతాయేమో ఒకసారి మీ మనస్సాక్షిని అడగండి అని అసెంబ్లీలో ఆరోజు చెప్పాను.’’ అని జగన్ పేర్కొన్నారు.

 ఐదు కుటుంబాలకు పరామర్శ: అనంతపురం జిల్లాలో జగన్ చేపట్టిన నాల్గోవిడత రైతు- చేనేత భరోసా యాత్ర మూడో రోజు శుక్రవారం ధర్మవరం నియోజకవర్గంలో కొనసాగింది. ఐదు కుటుంబాలను పరామర్శించారు.
Share this article :

0 comments: