వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలంటే బాబుకు భయం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలంటే బాబుకు భయం

వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలంటే బాబుకు భయం

Written By news on Saturday, January 9, 2016 | 1/09/2016


వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలంటే బాబుకు భయం
సాక్షి ప్రతినిధి, కర్నూలు: తమ పార్టీ ఎమ్మెల్యేలను చూస్తే ముఖ్యమంత్రి చంద్రబాబుకు భయమని జిల్లాలోని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఎద్దేవా చేశారు. కర్నూలు జిల్లాలో ఏకంగా 11 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉండటంతో ఆయన ఇక్కడికి వస్తే బ్యాలెన్స్ కోల్పోతున్నారని మండిపడ్డారు. ఒక్క ఎమ్మెల్యే కూడా వైఎస్సార్సీపీని వదిలి టీడీపీలో చేరే ప్రసక్తేలేద ని శుక్రవారం.. జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు స్పష్టం చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు బుడ్డా రాజశేఖర రెడ్డి, ఎమ్మెల్యేలు సాయి ప్రసాద్ రెడ్డి, బాలనాగిరెడ్డి, గౌరు చరిత, ఎస్వీ మోహన్ రెడ్డి, భూమా అఖిల ప్రియ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, గుమ్మనూరు జయరాం, ఐజయ్య, మణిగాంధీ, మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాష్ రెడ్డిలు శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

సంక్రాంతిలోగా ఎమ్మెల్యేలు పార్టీ మారుతారని ప్రచారం చేస్తున్నారని.. దీనిని ప్రజలు నమ్మబోరన్నారు. తప్పుడు ప్రచారం చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు ఆ పార్టీ నేత లు ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై తమకు సంపూర్ణ విశ్వాసం ఉందని...వైఎస్ కు టుంబం వెంటే ఉంటామని స్పష్టం చేశా రు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే చీప్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు.
 
తలి పాలు తాగి రొమ్ము గుద్దే రకం..!
టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదని ఎమ్మెల్యేలు విమర్శించారు. రైతులకు సంపూర్ణ రుణమాఫీ చేయలేకపోయారని, డ్వాక్రా మహిళల రుణమాఫీ ఊసే ఎత్తడం లేదన్నారు. ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారని.. ఇటువంటి పరిస్థితులల్లో జన్మభూమి సభలో ప్రజలు నిలదీస్తున్నారని.. ఈ సమస్యల నుంచి దృష్టి మళ్లిం చేందుకే వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వస్తున్నారనే ప్రచారం చేస్తున్నారన్నారు.

అధికార పార్టీకి బాకాలూదుతున్న ఒక మీడియా.. ప్రజా సమస్యలపై వార్తలు రాయాలని సూచించారు. జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేల సంఖ్య తక్కువగా ఉందని.. అందుకే వలసలను ప్రోత్సహించేందుకు సీఎం కు యుక్తులు పన్నుతున్నారన్నారు. అయితే ఆయన చేష్టలు తమ వద్ద ఉడకబోవన్నారు. చంద్రబాబు నైజం తమకు తెలుసునని.. ఆయన తల్లిపాలు తాగి రొమ్ము గుద్దేరకమని మండిపడ్డారు. త్వరలో క ర్నూలు కార్పొరేషన్ ఎన్నిక లు ఉన్నాయని..  ప్ర జలు తగిన బు ద్ధి చెబుతారన్నారు.
 
వైఎస్సార్సీపీలోకి వస్తున్నామంటున్నారు..
వాస్తవానికి ప్రభుత్వ తీరుపై టీడీపీ నేతలే అసంతృప్తిగా ఉన్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ అమలు కావడం లేదని టీడీపీ ఎమ్మెల్యేలు వాపోతున్నారన్నారు. అందుకే వైఎస్సార్సీపీలోకి వస్తామని..వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి చెప్పాలని అసెంబ్లీలో అనేక మంది టీడీపీ ఎమ్మెల్యేలు తమతో వ్యాఖ్యానిస్తున్నారని పేర్కొన్నారు.

ఇటువంటి పరిస్థితి ఉంటే.. వైఎస్సార్సీపీని బలహీనం చేసే ఉద్దేశంతో అబద్ధపు ప్రచారానికి దిగుతున్నారన్నారు. అది జన్మలో సాధ్యమయ్యే పని కాదని ఎమ్మెల్యేలు తేల్చిచెప్పారు. వ్యక్తిగత పనులతో  తన తండ్రి భూమా నాగిరెడ్డి సమావేశానికి రాలేకపోయారని, అయితే కొన్ని పత్రికలు.. పార్టీ మారాలనే ఉద్దేశంతోనే భూమా హాజరు కాలేదని రాస్తాయేమోనని భూమా అఖిలప్రియ చమత్కరించారు.
Share this article :

0 comments: