
యూనివర్సిటీ క్యాంపస్ (తిరుపతి): ఎస్వీయూలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు నిర్వహించడంపై నిరసనలు కొనసాగుతున్నాయి. పలు విద్యార్థి సంఘాలు ఆందోళన చేశాయి. వీసీ, రిజిస్ర్టార్ లను తొలగించాలని వారు డిమాండ్ చేశారు. గవర్నర్ నరసింహన్ ఈ విషయంపై జోక్యం చేసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు కోరారు.
కాగా ఎస్వీయూ వీసీ దామోదరం వ్యవహార శైలిపై వైఎస్సాఆర్ విద్యార్థి విభాగం గవర్నర్ నరసింహన్‌కు ఫిర్యాదు చేసింది. వీసీ దామోదరం శనివారం క్యాంపస్‌లో టీఎన్‌ఎస్‌ఎఫ్ నిర్వహించిన నారా లోకేష్ జన్మదిన వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేశారు. దీనిపై వైఎస్సాఆర్ విద్యార్థి సంఘం ఆందోళన కూడా నిర్వహించింది.
ఈ సంఘటనపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసినట్లు వైఎస్సార్ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు వి.హరిప్రసాద్ రెడ్డి తెలిపారు. లోకాయుక్తకు కూడా ఫిర్యాదు చేయనున్నామని చెప్పారు. వీసీ అధికార పార్టీ తొత్తుగా వ్యవహరిస్తూ విద్యార్థుల సమస్యలు గాలికొదిలేశారని, క్యాంపస్‌లో రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని ఫిర్యాదు చేశామన్నారు.
0 comments:
Post a Comment