రాష్ట్రం సమైక్యంగా ఉండాలని ఎంతోమంది పోరాడారు.జైల్లో పెడతారా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాష్ట్రం సమైక్యంగా ఉండాలని ఎంతోమంది పోరాడారు.జైల్లో పెడతారా?

రాష్ట్రం సమైక్యంగా ఉండాలని ఎంతోమంది పోరాడారు.జైల్లో పెడతారా?

Written By news on Friday, January 22, 2016 | 1/22/2016


దమ్ముంటే నిజాలు చెప్పండి
సీఎం చంద్రబాబుకు విపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సవాల్
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ‘చంద్రబాబును అడుగుతున్నా.. దమ్ము ధైర్యం ఉంటే ఎంపీ మిథున్‌రెడ్డిపై పెట్టిన కేసులో నిజాలు బైటపెట్టు. ఛాలెంజ్ చేసి అడుగుతున్నా ఆయన తప్పు చేసినట్లు రుజువుచేయగలరా? రాష్ట్రంలో దారుణమైన పాలన సాగిస్తున్నారు. ఎమర్జెన్సీని తలపిస్తోంది. బ్రిటీష్ పాలనకంటే దారుణంగా ఉంది. మా పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలపై దొంగ కేసులు పెట్టి జైల్లో పెట్టారు. ఖచ్చితంగా చెబుతున్నా.. ఇవే పరిస్థితులు మీకూ వస్తాయి’ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబుపై నిప్పులు చెరిగారు.

నాలుగురోజులుగా నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బియ్యపు మధుసూదన్‌రెడ్డిని గురువారం వైఎస్ జగన్ పరామర్శించారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే...

దమ్ముంటే వాస్తవాలు బైటపెట్టండి..
‘‘ఆ రోజు ఏం జరిగిందంటే.. నన్ను సాగనంపటానికి మిథున్ ఎయిర్‌పోర్టుకు వచ్చారు. ఆ సమయంలో 19మంది ప్రయాణీకులు ఎయిర్‌పోర్టు మేనేజర్ తమకు బోర్డింగ్ పాసులు ఇవ్వలేదని కంప్లైంట్ చేశారు. వారికి బోర్డింగ్‌పాస్ ఎందుకు ఇవ్వలేదని మేనేజర్‌ను అందరి ముందే మిథున్ అడిగారు.  అలా మిథున్ అడగడం తప్పా? ఆ ప్రయాణీకులు మేనేజర్ దురుసుగా ప్రవర్తించినట్లు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆ లెటర్ ఎందుకు బయటపెట్టడం లేదు? ఆరోజు ఎయిర్‌పోర్టు మేనేజర్ 2 గంటల నుంచి 8 గంటల వరకు ఎయిర్‌పోర్టులోనే పనిచేశాడు.

మిథున్ చేయిచేసుకుని ఉంటే ఆరుగంటలపాటు మేనేజర్ ఎలా పనిచేస్తాడు? ఎయిర్‌పోర్టులో మిథున్ చేయిచేసుకుంటే సీఐఎస్‌ఎఫ్ బలగాలకు తెలియకుండా పోతుందా? నిజంగా కొట్టి ఉంటే వారు మిథున్‌ను అరెస్టు చేసి ఉండేవారు కదా? కేసులు పెట్టేవారు కదా? తిరుపతి ఎయిర్‌పోర్టులో సీసీ కెమెరాలు ఎక్కువగా ఉన్నాయి. అందరిముందు మిథున్ కొట్టి ఉంటే సీసీ కెమెరాల్లో ఉండాలి. అలా ఎక్కడైనా ఉందా? ఉంటే ఆ సీసీ ఫుటేజ్‌లను ఎందుకు బయటపెట్టడంలేదు? అయ్యా చంద్రబాబూ.. మీకు దమ్ము ధైర్యం ఉంటే నిజాలు బైటపెట్టండి.

ఇదంతా బాబు గీసిన స్కెచ్
అదేరోజు సాయంత్రం తిరుపతికి వచ్చిన చంద్రబాబు వెంటనే స్కెచ్ గీశారు. పోలీసులపై ఒత్తిడి తెచ్చారు. ఎయిర్‌పోర్టు మేనేజర్‌పైనా ఒత్తిడి తెచ్చి కేసు పెట్టించారు. కేసు పెట్టిన తర్వాత సాధారణంగా ఆసుపత్రిలో మెడికో లీగల్ సర్టిఫికేషన్ జరుగుతుంది కాబట్టి రుయా ఆసుపత్రికి తీసుకెళ్లారు. సీమాంధ్రలో ఇవాళ రుయా నెంబర్-1 ఆసుపత్రి. మేనేజర్ బాగానే ఉన్నాడని, ఎలాంటి దెబ్బలూ తగలలేదని రుయాలో సర్టిఫై చేశారు. మరుసటి రోజు మేనేజర్ డ్యూటీకి వెళ్లారు.

విషయం తెలుసుకున్న చంద్రబాబు, ఆయన దూతలు అయ్యయ్యో మీరు డ్యూటీకి వెళితే కేసు నిలబడదంటూ మేనేజర్‌ను యశోద ఆసుపత్రిలో చేరమన్నారు. సంఘటన జరిగిన నాలుగురోజుల తర్వాత మేనేజర్ ప్రైవేట్ ఆసుపత్రి యశోదలో చేరారు. మేనేజర్ సోదరుడు ఆ యశోద ఆసుపత్రిలో పనిచేస్తున్నాడు. ఒక ఎంపీ మీద దొంగ కేసు పెట్టి ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నారు.

కమీషన్లకు అడ్డుపడుతున్నాడనే మిథున్‌పై దొంగకేసులు
చిత్తూరు జిల్లాలో ఇరిగేషన్ సహా అన్ని ప్రాజెక్టుల్లో చంద్రబాబు, ఆయన కొడుకు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై కమీషన్లు దోచుకుంటున్నారు. అయితే టెండర్లలో మిథున్ పోటీకి వెళ్లి  ఎల్1 వచ్చేవిధంగా తక్కువకు కోట్ చేస్తున్నాడు. మిథున్ ఉంటే తక్కువకు టెండర్లు వేసి తమకు కమీషన్లు రాకుండా అడ్డుపడుతున్నాడనే చంద్రబాబు, ఆయన కొడుకు కక్షకట్టారు. అందుకే ఒక ఎంపీపై దొంగ కేసులు బనాయించే స్థాయికి దిగజారిపోయారు.

చంద్రబాబును ఒక్కటే అడుగుతున్నా. ఇన్ని ప్రశ్నలు వేశా. దమ్ము ధైర్యం ఉంటే వాటికి జవాబు చెప్పాలి. దొంగకేసులు బనాయిస్తూ మీరు సాగిస్తున్న పాలనను ప్రజలు చూస్తున్నారు. పైనుంచి దేవుడు చూస్తున్నాడు. కచ్చితంగా వీళ్లందరి ఉసురు మీకు తగులుతుంది. మీరు బంగాళాఖాతంలో కలిసే రోజు త్వరలోనే వస్తుంది.

సన్మానించాల్సిన వారిని జైల్లో పెడతారా?
రాష్ట్రం సమైక్యంగా ఉండాలని ఎంతోమంది పోరాడారు. అందులో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కూడా ఉన్నారు. సమైక్యాంధ్ర కోసం ఉద్యమం చేసినందుకు సన్మానించాల్సింది పోయి ఆ కేసును ఉపయోగించుకుని భాస్కర్‌ని అరెస్టు చేస్తారా? మరింత దుర్మార్గం ఏమిటంటే 2009లో గోడలపై రాతలు రాశారన్న కేసును తిరగదోడి భాస్కర్‌ని పీలేరుకు తీసుకెళ్తున్నారట. ఇంతకన్నా అన్యాయం ఏమన్నా ఉంటుందా? అన్నా.. భాస్కర్‌ని నాకన్నా ఎక్కువగా వేధిస్తున్నారని లోపల కలసినపుడు మిథున్ చెబుతున్నాడు. అరెస్టు చేసిన ఎంపీ, ఎమ్మెల్యేలను కలిసే అవకాశం కూడా లేకుండా చేస్తున్నారు.

ఈ పరిపాలన ఎమర్జెన్సీని తలపిస్తోంది. ఇలాంటి పాలన సాగిస్తున్నందుకు చంద్రబాబు సిగ్గుతో తలదించుకోవాలి. ఎల్లకాలం ఇలాగే ఉండదు. మనం ఏం నాటితే అదే పండు వస్తుంది. మీక్కూడా ఇదే పరిస్థితి వచ్చే రోజులు త్వరలోనే వస్తాయని చెబుతున్నా. రోజమ్మ, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మిథున్, చెవిరెడ్డి, భూమా నాగిరెడ్డి ఇలా... వైఎస్సార్‌సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలపైన తప్పు డు కేసులు పెట్టారు.భయభ్రాంతులకు గురిచేసి వారి స్థయిర్యాన్ని దెబ్బకొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.  

ప్రజలు, ఆ దేవు డు  చూస్తున్నారు. ’’ అని జగన్ పేర్కొన్నారు. ఆయనతో పాటు పార్టీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ జ్యోతుల నెహ్రూ, కడప ఎంపీ అవినాష్‌రెడ్డి, చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి, చింతల రామచంద్రారెడ్డి, డాక్టర్ సునీల్, శ్రీకాంత్‌రెడ్డి, శ్రీనివాసులు, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, అనిల్‌కుమార్‌యాదవ్, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య, నెల్లూరు జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, ప్రోగ్రామ్స్ కమిటీ కన్వీనర్ తలశిల రఘురాంలు ఉన్నారు.

ఆరోగ్యమిత్రల తొలగింపు దారుణం మద్దతుగా పోరాడతాం: జగన్
 ఎనిమిదేళ్లుగా పనిచేస్తున్న ఆరోగ్యమిత్రలను తొలగించటం అన్యాయమని, వారికి మద్దతుగా పోరాడతామని  వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టంచేశారు.  ‘బాబొస్తే జాబు వస్తుందన్నారు. బాబొచ్చారు.. ఉన్న జాబులు పోతున్నాయి’ అని ఆయన విమర్శించారు. రాష్ర్టంలో 6వేల మంది ఆరోగ్యమిత్రలను తొలగిస్తూ ఈనెల 20న రాష్ర్టప్రభుత్వం జీవో 28 జారీ చేసిన సంగతి తెల్సిందే.

నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న ఎంపీ, మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డిని పరామర్శించేందుకు వచ్చిన జగన్‌ను జిల్లాకు చెందిన ఆరోగ్యమిత్రలు కలుసుకుని వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు ప్రతిపక్ష నేతకు తమ కష్టాలను ఏకరువు పెట్టారు. ఉద్యోగంపైనే ఆధారపడి బతుకుతున్న తాము ఇక ఎలా బతికేది? అంటూ కన్నీరు పెట్టుకున్నారు.  కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేస్తానని చెప్పి అందరినీ తొలగిస్తున్నారని, తాము అధికారంలోకి వచ్చాక కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేస్తామని జగన్ హామీ ఇచ్చారు.
Share this article :

0 comments: