తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు: వైఎస్ జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు: వైఎస్ జగన్

తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు: వైఎస్ జగన్

Written By news on Thursday, January 14, 2016 | 1/14/2016


తెలుగు నేల సంతోషాలతో కళకళలాడాలి
సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
 సాక్షి, హైదరాబాద్: ఈ భోగి పండుగ అందరికీ భోగభాగ్యాల్ని ప్రసాదించాలని, సంక్రాంతి పండుగ తెలుగు రాష్ట్రాలలోను, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరి ముంగిళ్లలో వెలుగులు నింపాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్షించారు. రంగవల్లులు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, గాలిపటాల సందళ్లతో, రకరకాల వేడుకలతో కూడిన సంక్రాంతి అంటేనే రైతులు, పల్లెల పండుగ అని ఆయన అన్నారు.
పాడిపంటలతో, పైరుపచ్చలతో ప్రతి పల్లె కళకళలాడినప్పుడే ప్రజలు ఆనందంగా ఉంటారని, అన్నపూర్ణగా పేరుగాంచిన తెలుగు నేలలో రైతన్నలు, గ్రామీణ వృత్తుల వారంతా భోగభాగ్యాలతో, సుఖసంతోషాలతో తులతూగాలని కోరుకుంటున్నానని ఆయన బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Share this article :

0 comments: