వైఎస్ఆర్ సీపీ ఎంపీ, ఎమ్మెల్యేల అరెస్ట్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ఆర్ సీపీ ఎంపీ, ఎమ్మెల్యేల అరెస్ట్

వైఎస్ఆర్ సీపీ ఎంపీ, ఎమ్మెల్యేల అరెస్ట్

Written By news on Sunday, January 17, 2016 | 1/17/2016


వైఎస్ఆర్ సీపీ ఎంపీ, ఎమ్మెల్యేల అరెస్ట్
తిరుపతి: తమిళనాడు రాజధాని చెన్నై ఎయిర్ పోర్టులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డిని శనివారం అర్ధరాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించినట్లు కనిపిస్తోంది. గతేడాది నవంబర్ 26న ఎయిర్ పోర్ట్ అధికారితో తలెత్తిన గొడవ విషయమై ఎంపీని అరెస్ట్ చేశారు. శనివారం అర్ధరాత్రి నుంచే వైఎస్ఆర్ సీపీ నేతల ఇళ్లపై పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు. ఆయనను అరెస్ట్ చేయకముందే చిత్తూరు జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలను ముందస్తుగా అరెస్ట్ చేశారు. దీంతో పాటు ఆరుగురు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కడప జిల్లాలోని 68 పోలీసు స్టేషన్ లలో ఆ పార్టీ నాయకులు ఉన్నట్లు సమాచారం.

చిత్తూరు జిల్లాలో ప్రధాన రోడ్లపై చెక్ పోస్టులు ఏర్పాటు చేసి నేతలను అదుపులోకి తీసుకునే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆస్పత్రిలో ఎంపీ మిథున్ రెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం శ్రీకాళహస్తి జడ్జి ఎదుట హాజరు పరిచారు. శ్రీకాళహస్తి మేజిస్ట్రేట్ ఎంపీ మిథున్ రెడ్డికి 7 రోజుల రిమాండ్ విధించారు. ఆయనను నెల్లూరు సబ్ జైలుకు తరలిస్తున్నారు.. చిత్తూరు జిల్లా మొత్తం 144 సెక్షన్ నడుస్తోంది, 30యాక్ట్ అమలు చేస్తున్నారు. వందలాది వాహనాలలో తిరుపతికి తరలివస్తున్న వైఎస్ఆర్ సీపీ శ్రేణులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. నేతల అరెస్టులపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Share this article :

0 comments: