ఇది పచ్చి మోసకారి ప్రభుత్వం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఇది పచ్చి మోసకారి ప్రభుత్వం

ఇది పచ్చి మోసకారి ప్రభుత్వం

Written By news on Sunday, January 31, 2016 | 1/31/2016


ఇది పచ్చి మోసకారి ప్రభుత్వం
ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజం

 సాక్షి ప్రతినిధి, కడప:   ‘డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చెప్పి ఒక్క రూపాయి మాఫీ చేయలేదు. రైతు రుణమాఫీ అన్నాడు.. అదీ కాలేదు. నిరుద్యోగులందరికీ ఉద్యోగాలన్నాడు.. మా పిల్లగాళ్లకు ఎలాంటి ఉద్యోగమూ రాలేదు. చంద్రబాబు మమ్మల్ని మోసగించాడు సార్..’ అంటూ వేంపల్లె మండలం బక్కన్నగారిపల్లెకు చెందిన ఎస్టీ మహిళలు ప్రతిపక్షనేత, వైఎస్సార్‌కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి విన్నవించారు. ‘నిజమే తల్లీ.. పచ్చిమోసకారి ప్రభుత్వమిది.. చంద్రబాబు ప్రజల్ని నిలువునా వంచించాడు. రుణమాఫీ అని చెప్పి బ్యాంకర్ల వద్ద రైతులను డీఫాల్టర్స్‌గా మార్చారు.

వడ్డీకి సరిపడా మొత్తం కూడా మాఫీ కాలేదు. డ్వాక్రా రుణాలు మాఫీ అంటూ అక్క చెల్లెళ్లకూ అన్యాయం చేశాడు. ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నాడు. ఉన్న ఉద్యోగాలనే ఊడగొడుతున్నాడు. ప్రభుత్వ పథకాలు ప్రజలందరికీ వర్తించే పరిస్థితే లేదు. ఇంతటి దుర్మార్గపు ప్రభుత్వం మరెక్కడా ఉండదు’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. వైఎస్‌ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలో రెండవ రోజు శనివారం నాటి పర్యటనలో ప్రజలకు, వైఎస్ జగన్‌కు మధ్య సంభాషణ ఇది. ఇటీవల మృతి చెందిన వేంపల్లె మాజీ మండలాధ్యక్షుడు రామచంద్రారెడ్డి స్మృతికి వైఎస్ జగన్ ఘనంగా నివాళులు అర్పించారు.

ఆయన కుమారుడు, ప్రస్తుత వేంపల్లె మండలాధ్యక్షుడు రవికుమార్‌రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. తిరుగు ప్రయాణంలో ప్రతిపక్షనేతను చూసేందుకు, ఆయనకు తమ కష్టాలు తెలుపుకునేందుకు బక్కన్నగారిపల్లె మహిళలు బారులుతీరారు. వారిని చూడగానే వాహనం ఆపిన జగన్ ‘బాగున్నారా అమ్మా..’ అని పలుకరించారు. ప్రతిపక్షనేత ఆప్యాయంగా పలుకరించడంతో వారిలో ఆవేదన కట్టలు తెంచుకుంది. తమ కష్టాలన్నిటినీ ఏకరువుపెట్టారు. దీంతో ప్రజల పట్ల ప్రభుత్వం అన్యాయంగా ప్రవర్తిస్తోందని వైఎస్ జగన్ మండిపడ్డారు. ప్రభుత్వ పథకాలు కొందరికి మాత్రమే దక్కుతున్నాయని ఆయన  ఆగ్రహం వ్యక్తం చేశారు.

 జగన్ హెచ్చరికతో తాగునీరు సరఫరా
 తాగునీటి సరఫరా నిలిచిపోయి మూడువారాలుగా  ఇక్కట్లు పడుతున్న 100 గ్రామాలు  జగన్ జోక్యంతో ఊరటచెందాయి. పులివెందుల నియోజకవర్గంలోని పార్నపల్లె సీపీడబ్ల్యు స్కీం నుంచి  బంద్ చేశారు. ఈ విషయం తెలుసు  జగన్ ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఈ శ్రీనివాసులుతో మాట్లాడి  నీటి సరఫరా వెంటనే చేయించారు.
Share this article :

0 comments: