
అనంతపురం: వైఎస్ఆర్ సీపీ అధినేత, ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనంతపురం జిల్లాలో చేపట్టిన రైతు భరోసా యాత్ర నేడు ఏడో రోజు కొనసాగుతుంది. జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గంలో మంగళవారం వైఎస్ జగన్ పర్యటిస్తారు. సీకేపల్లి మండలం వెంకటాంపల్లిలో రైతు రామచంద్రారెడ్డి కుటుంబాన్ని పరామర్శిస్తారు.
అనంతరం బసంపల్లిలో రైతు సోమశేఖర్ కుటుంబాన్ని కలుసుకుని వారిని పరామర్శించి భరోసా ఇవ్వనున్నారు. రెండు కుటుంబాలను పరామర్శించడంతో అనంతపురంలో వైఎస్ జగన్ చేపట్టిన నాలుగో విడత రైతు భరోసాయాత్ర ముగియనుంది.
0 comments:
Post a Comment