
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై ప్రజలను దగా చేస్తున్న టీడీపీ ప్రభుత్వ తీరును ఎండగట్టి రాష్ట్రానికి సంజీవనిలాంటి 'హోదా'ను సాధించడమే లక్ష్యంగా యువ'భేరీ మోగనుంది. రాష్ట్ర విభజనతో అన్నివిధాలా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ కు పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీ మేరకు...ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్ తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమ పథంలో పయనిస్తున్న విషయం తెలిసిందే.
►10.30 గంటలకు కాకినాడలోని అంబేద్కర్ భవన్‌కు చేరుకుంటారు.
► అక్కడ యువభేరి కార్యక్రమంలో విద్యార్థులు, యువతను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
► మధ్యాహ్నం 3 గంటలకు జేఎన్‌టీయూ సమీపంలోని బిల్డింగ్ సొసైటీ స్థలంలో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొంటారు.
►మాజీ మంత్రి ముత్తా గోపాలకృష్ణ, మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, యువ నాయకుడు ముత్తా శశిధర్‌లను పార్టీలోకి ఆహ్వానిస్తారు.
0 comments:
Post a Comment