సింగపూర్ కెందుకు.. ఢిల్లీకి వెళ్లు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సింగపూర్ కెందుకు.. ఢిల్లీకి వెళ్లు

సింగపూర్ కెందుకు.. ఢిల్లీకి వెళ్లు

Written By news on Wednesday, January 27, 2016 | 1/27/2016


'సింగపూర్ కెందుకు.. ఢిల్లీకి వెళ్లు'
కాకినాడ : రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు దాటినా ఇప్పటివరకూ ఒక్క నోటిఫికేషన్ విడుదల చేయలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. కాకినాడలోని అంబేద్కర్ భవన్ లో జరుగుతున్న యువభేరి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ... ఏపీపీఎస్సీ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారో తెలియని పరిస్థితి నెలకొందన్నారు.
 
బాబు అధికారంలోకి వస్తే జాబు వస్తుందని ఊదరగొట్టారని...ఇప్పటి పరిస్థితి చూస్తే ఆయన అధికారంలోకి రాగానే ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతున్నారని మండిపడ్డారు. ప్రత్యేక హోదాను చంద్రబాబు నాయుడు తాకట్టుపెట్టారని, హోదా గురించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీయాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదాతో ఉత్తరాఖండ్ లో ఏ విధంగా ఉద్యోగ అవకాశాలు పెరిగాయో ఈ సందర్భంగా ఆయన ...విద్యార్థులకు వివరించారు. వైఎస్ జగన్ ఇంకా ఏంమాట్లాడారంటే...
 • ఆరోగ్య మిత్ర ఉద్యోగులను ఎలాంటి కారణం లేకుండా నిర్ధాక్షణ్యంగా తొలగించారు.
 • ఉద్యోగాలు ఎలా కత్తిరించాలా అని దిక్కుమాలిన ఆలోచన సర్కార్ చేస్తోంది.
 • ఏపీపీఎస్సీ పరీక్షలు ఎప్పుడు జరుగుతాయో తెలియదు.
 • పీహెచ్ డీలు చదివినవారు కూడా పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
 • ప్రత్యేక హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను చొక్కా పట్టుకుని నిలదీయాలి.
 • ప్రత్యేక హోదాతో గ్రాంట్లు ఎక్కువగా వస్తాయి.
 • దేశంలో 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఉంది.
 • పరిశ్రమలకు 100 శాతం రాయితీలు ప్రత్యేక హోదాతోనే సాధ్యం.
 • పరిశ్రమల కోసం చంద్రబాబు సింగపూర్, మలేషియా, దావోస్ వెళ్లాల్సిన అవసరం లేదు.
 • ఢిల్లీ వెళ్లి ప్రధానిపై ఒత్తిడి తెస్తే సరిపోతుంది.
 • ప్రత్యేక హోదాతో ప్రతి జిల్లా ఒక హైదరాబాద్ అవుతుంది.
 • ఉద్యోగాలు, పరిశ్రమలు అన్ని హైదరాబాద్ కే పరిమితం అయ్యాయి.
 • పార్లమెంట్ సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తామని నాటి ప్రధాని హామీ ఇచ్చారు.
 • అయిదేళ్లు కాదు పదేళ్లు కావాలని బీజేపీ, టీడీపీలు అడిగాయి.
 • టీడీపీ మేనిఫెస్టోలో కూడా ఇదే విషయం చెప్పింది.
 • బాబు వస్తే జాబు వస్తుందని జాబు రాకుంటే నిరుద్యోగ భృతి వస్తుందని ఊదరగొట్టారు.
 • ఎన్నికలప్పుడు ఇచ్చిన మాట మరచిపోయారు.
 • ప్రజలతో పని ఏమున్నట్లు వ్యవహరిస్తున్నారు.
 • రోజుకో మాటతో మభ్యపెడుతున్నారు.
 • ప్యాకేజీ పేరు చెబితే చంద్రబాబును చొక్కాపట్టుకొని నిలదీయండి.
 • మభ్యపెట్టడం న్యాయమేనా అని చంద్రబాబును ప్రశ్నించండి.
 • ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తారా లేదా అని కేంద్రానికి వైఎస్ఆర్ సీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి లేఖ రాశారు.
 • ప్రత్యేక హోదా ఇచ్చే ఉద్దేశం లేదని స్పష్టంగా లేఖలో కేంద్రం పేర్కొంది.
 • మీ ముందుకు వచ్చే కేంద్ర, రాష్ట్ర మంత్రులను, చంద్రబాబును ప్రశ్నించండి.
 • తక్కువ జనాభా ఉన్న జమ్ముకశ్మీర్ కు రూ.70వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించారు.
 • మన రాష్ట్రానికి ఎన్నివేల కోట్ల ప్యాకేజీ ఇవ్వాలో చెప్పండి.
 •  
 • ప్రధాని తలుచుకుంటే ప్రత్యేక హోదాకు అడ్డు ఎవరో చంద్రబాబు వచ్చినప్పుడు నిలదీయండి.
 • ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ప్లానింగ్ కమిషన్ ఇచ్చిన లేఖ 8 నెలలుగా పెండింగ్ లో ఉన్నా చంద్రబాబు అడగలేదెందుకు?.
 • పోలవరం నుంచి పట్టిసీమ వరకు, ఇసుక నుంచి బొగ్గు, మద్యం వరకూ అన్ని లంచాలే.
 • అవినీతి డబ్బుతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన చంద్రబాబు కేసు నుంచి తప్పించుకునేందుకు హోదాను తాకట్టు పెట్టారు.
 • హోదా ఇవ్వకుంటే కేంద్రంలో తమ మంత్రులను ఉపసంహరించుకుంటామని చంద్రబాబు ఎందుకు అడగరు.
 • ప్రత్యేక హోదా ఒక దండగ అని...హోదా కోసం పోరాటం వృధా అనేవిధంగా సీఎం వ్యవహరిస్తున్నారు.
 • అందరం కలిసి ఒత్తిడి తెస్తేనే ప్రత్యేక హోదా వస్తుంది.
 • అందరం ఒకటై పోరాడుదాం.
Share this article :

0 comments: