
హెచ్ సీయూలో జరిగిన ఘటనలపై సమాజంలో ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోవాలని జగన్ అన్నారు. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు వారిని వారు ప్రశ్నించుకోవాలని పేర్కొన్నారు. రోహిత్ పై చర్యలు తీసుకోవాలని వీసీకి లేఖలు మీద లేఖలు రాయడం దేనికి సంకేతమని జగన్ ప్రశ్నించారు. ఈ నేలపై మానవత్వం మాయమైపోతోందా? అని ఆవేదన వ్యక్తం చేశారు. రోహిత్ తెలివైన విద్యార్థి అని, అతని ది చాలా పేద కుటుంబమని, రోహిత్ తల్లి ఎన్నో ఆశలతో ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా నుంచి అతన్ని ఉన్నత చదువుల కోసం హె చ్ సీయూకు పంపారని చెప్పారు.
జగన్ ఇంకా ఏం మాట్లాడారంటే..
- విద్యార్థులపై విధించిన సస్పెన్షన్ ను వెంటనే ఎత్తివేయాలి
- రోహిత్ ఎస్సీ కాదు బీసీ అని ప్రచారం చేయడంలో అర్థమేంటి?
- చనిపోయాక కులంపై ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారు
- ఇలాంటి ఘటనలు పునరావృతం కారాదు
- మొత్తం ఘటనను మార్చే ప్రయత్నం చేస్తున్నారు
- విచారణ కమిటీలో ఉన్న వారికి మంచి పేరు లేదు
- విద్యార్థులను విద్యార్థులగానే ఉండనివ్వండి
- రోహిత్ కుటుంబాన్ని ఆదుకోవాలి
- విద్యార్థులకు మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది
- విద్యార్థుల డిమాండ్లను పరిశీలించాలి
- ఈ ఘటనను పార్లమెంట్ లో మా ఎంపీలు ప్రస్తావిస్తారు
0 comments:
Post a Comment