ప్రత్యేక హోదా లేకుండా రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా వస్తాయి? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రత్యేక హోదా లేకుండా రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా వస్తాయి?

ప్రత్యేక హోదా లేకుండా రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా వస్తాయి?

Written By news on Thursday, January 14, 2016 | 1/14/2016


విశాఖ సదస్సు ప్రహసనమే..
ప్రత్యేక హోదా లేకుండా రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా వస్తాయి?: బొత్స

 సాక్షి, హైదరాబాద్: ‘‘ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేయడం అవసరమే. అయితే, అంతకు ముందు ప్రభుత్వాలు తమ ప్రాంతాల్లోనే పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చేంతగా అనువైన వాతావరణాన్ని కల్పించాలి. రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రత్యేక హోదా లేకుండా మన రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా వస్తాయి?’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. విశాఖ సదస్సు ఓ ప్రహసనమన్నారు.ప్రత్యేక హోదా సాధన విషయంలో తెలుగుదేశం ప్రభుత్వ వైఖరేమిటో స్పష్టం చేయాలని తమ పార్టీ ఎన్నోమార్లు ప్రశ్నించినప్పటికీ వారి నుంచి సమాధానం రావడం లేదని తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.

‘‘చంద్రబాబు గతంలో సీఎంగా పనిచేసిన తొమ్మిదేళ్ల కాలంలో ఐదారుసార్లు పెట్టుబడుల కోసం సదస్సులు నిర్వహించారు. రూ.లక్షల కోట్ల ఒప్పందాలు చేసుకున్నారు. ఆయన హయాంలో వెయ్యి కోట్ల పరిశ్రమ ఒక్కటైనా రాష్ట్రానికి వచ్చిందా? వస్తే దాని పేరు చెప్పమనండి’’ అని అన్నారు. విశాఖపట్నం జరిగిన పెట్టుబడుల సదస్సులో రాష్ట్రంలో వంద స్టార్ హోటళ్ల ఏర్పాటుకు సంబంధించి ఒక సంస్థతో ఒప్పందం చేసుకున్నారని.. అది సాధ్యమా అని  బొత్స ప్రశ్నించారు. గత రెండేళ్ల కాలంలో భారతదేశం 7 శాతం వృద్ధి సాధిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 11.7 శాతం వృద్ధి సాధించిందని చెబుతున్నారని.. అదెలా సాధ్యమో తమకు అర్థం కావడం లేదని బొత్స వ్యాఖ్యానించారు.
Share this article :

0 comments: