వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి అరెస్ట్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి అరెస్ట్

వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి అరెస్ట్

Written By news on Monday, January 18, 2016 | 1/18/2016


వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి అరెస్ట్
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విపక్ష ఎమ్మెల్యేలపై అక్రమ కేసులు భానాయించి అరెస్ట్ ల పర్వం కొనసాగిస్తోంది. శనివారం అర్థరాత్రి ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ చేయగా... సోమవారం మరో ఇద్దరు ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయడంతో ప్రభుత్వ నిరంకుశ వైఖరి తేటతెల్లమవుతుంది.

సోమవారం ఉదయం నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అరెస్ట్ చేయగా, మరో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని సోమవారం తెల్లవారు జామున 4 గంటలకు తిరుపతిలో అరెస్ట్ చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమం కేసులో చెవిరెడ్డిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. అరెస్ట్ సందర్భంగా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆయనను నెల్లూరు కోర్టులో హాజరుపరచగా... ఈ నెల 29 వరకు కోర్టు రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఆయనను నెల్లూరు జైలుకు తరలించారు.
ఈ సందర్భంగా చెవిరెడ్డి మాట్లాడుతూ... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్ల చంద్రబాబు ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహారిస్తుందన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం కేసులు ఎత్తివేస్తామన్న బాబు సర్కార్ మాట తప్పిందని ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం పథకం ప్రకారమే వైఎస్సార్ సీపీ నేతలను అరెస్ట్ చేస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చెవిరెడ్డి అరెస్ట్ తో చిత్తూరు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
Share this article :

0 comments: