ప్రాణం ఉన్నంతవరకూ జగన్ తోనే - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రాణం ఉన్నంతవరకూ జగన్ తోనే

ప్రాణం ఉన్నంతవరకూ జగన్ తోనే

Written By news on Friday, January 8, 2016 | 1/08/2016


కర్నూలు : నీతిమాలిన రాజకీయాలకు తెర తీస్తున్నారంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై కర్నూలు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు శుక్రవారం  నిప్పులు చెరిగారు. జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉందని.. ఈ నేపథ్యంలో పార్టీని దెబ్బకొట్టేందుకు చంద్రబాబు కుట్ర పన్నారని వారు ఆరోపించారు.
చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేసినా తమ పార్టీ నుంచి ఎవరూ మరో పార్టీలోకి వెళ్లరని వారు తెలిపారు. ప్రాణం ఉన్నంత వరకూ తాము వైఎస్ జగన్ తోనే ఉంటామని ఈ సందర్భంగా వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. ప్రజాసమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడతామని వారు తెలిపారు.

Share this article :

0 comments: