వైఎస్సార్సీపీ లోకి ఏపీపీఎస్సీ మాజీ సభ్యుడు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్సార్సీపీ లోకి ఏపీపీఎస్సీ మాజీ సభ్యుడు

వైఎస్సార్సీపీ లోకి ఏపీపీఎస్సీ మాజీ సభ్యుడు

Written By news on Sunday, January 24, 2016 | 1/24/2016


వైఎస్సార్సీపీ లోకి  ఏపీపీఎస్సీ మాజీ సభ్యుడు
♦ చంద్రశేఖర్‌ను సాదరంగా
♦ ఆహ్వానించిన జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ సభ్యుడు, రాష్ట్ర ఆర్య వైశ్య నాయకుడు గుబ్బా చంద్రశేఖర్ శనివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఆయన నివాసంలో కలుసుకుని పార్టీలో కలిసి పనిచేయాలన్న తన అభీష్టాన్ని వెల్లడించారు. ఆయనకు పార్టీ కండువాను కప్పి జగన్ సాదరంగా ఆహ్వానించారు.
ఎమ్మెల్సీ కోలగ ట్ల వీరభద్రస్వామి, అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, పలువురు ఆర్యవైశ్య మహాసభ ప్రముఖులు గాధంశెట్టి శ్రీనివాస్ (ఆర్య వైశ్య మహాసభ ప.గో.జిల్లా అధ్యక్షుడు), కాళ్లకూరి నాగబాబు (మహాసభ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు), సాధూ ప్రతాప్ (గుంటూరు జిల్లా అధ్యక్షుడు), దర్శి వాసు (రాష్ట్ర మహాసభ అదనపు ప్రధాన కార్యదర్శి) కె.రామ్‌కుమార్ (ఆర్యవైశ్య యువజన సంఘాల సమాఖ్య మాజీ అధ్యక్షుడు), పీవీఎ న్ ప్రసాద్ (కడప మాజీ అధ్యక్షుడు), షరాబు సుబ్రమణ్యం (నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి), చిప్పగిరి ప్రసాద్ (వైఎస్సార్‌సీపీ ప్రొద్దుటూరు టౌన్ అధ్యక్షుడు), నెల్లూరు నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ ద్వారకానాథ్, కుప్పం ప్రసాద్ (ఒంగోలు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు) ఈ సందర్భంగా హాజరయ్యారు.
గుబ్బా రాక మాకు బలం..
చేరిక అనంతరం వీరభద్రస్వామి మాట్లాడుతూ గుబ్బా చంద్రశేఖర్ పార్టీలో చేరడం తమకు ఎంతో బలమని, ఆయనకు తమ కులంలో మంచి పట్టు ఉందన్నారు. రాష్ట్రంలో యావత్ వ్యాపార లోకానికి టీడీపీ ప్రభుత్వంపై నమ్మకం పూర్తిగా పోయిందని ఆ పార్టీ వేధింపులకు తట్టుకోలేక పోతున్నారన్నారు. వ్యాపారులకు రక్షణ కల్పించేది జగన్ మాత్రమేనన్నారు. తామంతా త్వరలో రాష్ట్రమంతటా పర్యటించి పార్టీని బలోపేతం చేస్తామన్నారు.
సొంతింటికి వచ్చినట్లుగా ఉంది..
వైఎస్సార్‌సీపీలో చేరిక తనకు సొంతింటికి వచ్చినట్లుగా ఉందని, వైఎస్ రాజశేఖరరెడ్డి జీవించి ఉన్న రోజుల్లో తాను ఆయనకు చాలా సన్నిహితంగా ఉండేవాడినన్నారు. రోశయ్య సీఎం అయ్యాక తనను ఏపీపీఎస్సీ సభ్యుడిగా నియమించారని ఆ పదవిలో ఉన్నపుడు పరిమితుల రీత్యా దూరంగా మెలిగానన్నారు. పదవీ విరమణ చేశాక  వైఎస్సార్‌సీపీలో చేరుతున్నానని వివరించారు. ప్రస్తుత రాజకీయాల్లో విశ్వసనీయతకు మారు పేరుగా వైఎస్సార్‌సీపీ నిలిచిందని, అందుకే జగన్‌తో కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నానన్నారు. గుంటూరులో త్వరలో రాబోయే మేయర్ ఎన్నికల్లోనూ, 2019 ఎన్నికల్లోనూ పార్టీ గెలుపు కోసం శాయశక్తులా కృషి చేస్తానన్నారు.
Share this article :

0 comments: