గ్రేటర్‌లో ఓటడిగే హక్కు మాకే ఉంది - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » గ్రేటర్‌లో ఓటడిగే హక్కు మాకే ఉంది

గ్రేటర్‌లో ఓటడిగే హక్కు మాకే ఉంది

Written By news on Saturday, January 9, 2016 | 1/09/2016


గ్రేటర్‌లో ఓటడిగే హక్కు మాకే ఉంది: పొంగులేటి
♦ హైదరాబాద్ అభివృద్ధి ముమ్మాటికీ వైఎస్సార్ ఘనతే: పొంగులేటి
♦ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని వెల్లడి

 సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో ఓట్లడిగే హక్కు తమ పార్టీకే ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఈ ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు లేకుండా ఒంటరిగానే పోటీ చేస్తామని చెప్పారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఉమ్మడి రాష్ట్ర సీఎంగా హైదరాబాద్‌కు దేశంలోనే మంచి గుర్తింపు తీసుకొచ్చారన్నారు. శుక్రవారమిక్కడ లోటస్‌పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు కె.శివకుమార్, బి.సాయినాథ్‌రెడ్డిలతో కలసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైఎస్.. నగరాభివృద్ధికి ముందుచూపుతో బాటలు వేశారని, ప్రజలకు ఎనలేని సేవలందించారని చెప్పారు.

ఆయన హయాంలోనే ఎంసీహెచ్‌ను జీహెచ్‌ఎంసీగా మార్చి శివారు మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలను విలీనం చేశారని, పెద్దఎత్తున మౌలిక వసతులు, సౌకర్యాలు కల్పించారన్నారు. నగరాన్ని ఐటీ రంగంలో అగ్రభాగానా నిలిపారని చెప్పారు. హైదరాబాద్ అభివృద్ధి ఘనత ముమ్మాటికీ వైఎస్‌దేనన్నారు. ఔటర్ రింగ్‌రోడ్డు, శంషాబాద్ విమానాశ్రయం, మెట్రోరైలు వంటి అనేక ప్రతిష్టాత్మక పనులను చేపట్టారని, నగరానికి కృష్ణా, గోదావరి జలాలు వచ్చేలా చేశారన్నారు. కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న వారు గోదావరి నీళ్లను తెప్పించిన ఘనత తమదిగా ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు.

ఓవైపు అధికారంలోకి వచ్చాక 18 నెలల్లోనే నీళ్లు తెచ్చామని చెబు తూ.. మరోవైపు ఇతర సమస్యలపై మొన్ననే అధికారానికి వచ్చామంటూ దాటవేయడం హాస్యాస్పదమన్నారు.  వైఎస్ కలలు సాకారం చేసేందుకు, రెండు రాష్ట్రాల ప్రజలకు మంచి చేసేందుకు తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

 ఒకట్రెండు రోజుల్లో మేనిఫెస్టో
 జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సంబంధించి ఒకట్రెండు రోజుల్లో మేనిఫెస్టో ప్రకటిస్తామని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ప్రజలకు సేవ చేసే అభ్యర్థులను ఎంపిక చేస్తామన్నారు. రాష్ట్రంలో రాజకీయ పార్టీగా మరింత బలపడేందుకు, భవిష్యత్‌లో సుస్థిర స్థానం సాధించుకునేందుకు తమ పార్టీ పోటీ చేస్తోందన్నారు. దొడ్డిదారిలో మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని టీఆర్‌ఎస్ చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు.
Share this article :

0 comments: