దళితుల నోటికాడ ముద్ద లాక్కుంటారా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » దళితుల నోటికాడ ముద్ద లాక్కుంటారా?

దళితుల నోటికాడ ముద్ద లాక్కుంటారా?

Written By news on Friday, January 8, 2016 | 1/08/2016


దళితుల నోటికాడ ముద్ద లాక్కుంటారా?
రాజధాని అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణ చర్యలపై వాసిరెడ్డి పద్మ ధ్వజం
సాక్షి, హైదరాబాద్: రాజధాని నిర్మాణం పేరుతో పచ్చటి పొలాలు లాక్కుని  రైతుల పొట్టకొట్టిన తరహాలోనే దళిత పేదరైతుల నోటికాడ ముద్దను సీఎం చంద్రబాబు లాక్కుంటున్నారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ విమర్శించారు. దళిత పేద రైతుల నుంచి తక్కువ ధరకే తన బినామీలు, మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలతో అసైన్డు భూములు కొనిపించి సీఎం చంద్రబాబు క్రమబద్ధీకరించుకొంటున్నారని, దీంట్లో కోట్లాది రూపాయల భారీ కుంభకోణానికి పాల్పడుతున్నారని ఆరోపించారు.

బృహత్తరమైన రాజధాని నిర్మాణంలో కొందరు రైతులు, దళితులు నష్టపోక తప్పదనే రీతిలో మాట్లాడటం దుర్మార్గమన్నారు. వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ, రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు వారి గ్రామంలోనే ప్లాట్లు కేటాయిస్తామంటూ మాయమాటలు చెప్పినబాబు, మంత్రులు ఇప్పుడు మాట మారుస్తున్నారని విమర్శించారు.

‘‘గత 18 నెలల్లో ఎన్ని ఎకరాల అసైన్డు భూములు ఎవరు కొనుగోలు చేశారు.. ఎక్కడెక్కడ కొనుగోలు చేశారు’’ వంటి వివరాలను వెల్లడించాలని పద్మ డిమాండ్ చేశారు. దళితులకు న్యాయం చేసే ఉద్దేశం చంద్రబాబుకుంటే తక్షణమే అసైన్డు భూముల క్రయవిక్రయాల క్రమబద్ధీకరణను విరమించుకోవాలన్నారు. రాజధాని ప్రాంతంలో అసైన్డు భూముల లబ్ధిదారులకే పరిహారం చెల్లించాలని కోరారు.
Share this article :

0 comments: