మిధున్ రెడ్డి అక్రమ అరెస్ట్ కు కువైట్ లో నిరసన - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మిధున్ రెడ్డి అక్రమ అరెస్ట్ కు కువైట్ లో నిరసన

మిధున్ రెడ్డి అక్రమ అరెస్ట్ కు కువైట్ లో నిరసన

Written By news on Tuesday, January 19, 2016 | 1/19/2016


కువైట్: మలియా ప్రాంతములో వైకాపా కువైట్ కన్వీనర్ యం. బాలిరెడ్డి గారి ఆధ్వర్యములో రాజంపేట పార్లమెంట్ సభ్యుడు మిధున్ రెడ్డి అక్రమ అరెస్ట్ కు కమిటి సభ్యులు అభిమానులతో కలిసి తమ నిరసన తెలిపారు.
ఈ సందర్భముగా బాలిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక నియంతల వ్యవహారిస్తున్నారని ప్రతిపక్ష పార్టీల నాయకులను అక్రమ అరెస్ట్ చేసి వారి మనో ధైర్యాన్ని దెబ్బ తీయాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని, వైకాపా లో అరెస్ట్ లకు భయపడే నాయకులు ఎవరు లేరన్నారు.

తెలుగు దేశం పార్టీ శాసన సభ్యుడు మహిళా ప్రభుత్వ ఉద్యోగిని విలేకరుల సమక్షములో కొడితే ఎలాంటి అరెస్ట్ లేదు, కాల్ మని కేసులో ఉన్నా తమ పార్టీ వారికి స్టేషన్ లోనే బెయిల్ ఇవ్వడం.ఎలాంటి తప్పు చేయని మృదు స్వభావి,ఉన్నతమైనవ్యక్తి  వై యస్ ఆర్ జిల్లా మరియు చిత్తూరు జిల్లా లో అత్యంత ప్రజాదరణ గల వ్యక్తి  మిథున్ రెడ్డి. కోర్టులో హాజరుకావడానికి వస్తున్న  మిథున్ రెడ్డిని బలవంతంగా అదుపులోకి తీసుకోవడం ,అదీ అర్ధ రాత్రి ఎయిర్ పోర్ట్ లో ఒక ఉగ్రవాదిని అరెస్ట్ చేసినట్లు అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యానికి  మంచి పరిణామం కాదు. ఇది చాల దారుణం అని అరెస్ట్ చేయడాన్ని ముక్తఖంఠంతో వైకాపా సభ్యులు ,అభిమానులు ఖండించారు.
ఈ కార్యక్రమములో కో కన్వీనర్లు గోవిందు నాగారాజు, యం.వి. నరసారెడ్డి, గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు యం. చంద్రశేఖర్ రెడ్డి, ఎ. ప్రభాకర్ రెడ్డి, సలహాదారులు శ్రీనివాసుల రెడ్డి. నాగిరెడ్డి చంద్ర, సభ్యులు ప్రవిణ్ కుమార్ రెడ్డి,షేక్ ఇమామ్ మరియు సి. చంద్రశేఖర్ రెడ్డి. బి. శివారెడ్డి, మన్నూరు సుబ్రహ్మణ్యం . భారి ఎత్తున అభిమానులు పాల్గోన్నారు
Share this article :

0 comments: