10 రోజుల కిందటే అపాయింట్ మెంట్ కోరాం.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 10 రోజుల కిందటే అపాయింట్ మెంట్ కోరాం..

10 రోజుల కిందటే అపాయింట్ మెంట్ కోరాం..

Written By news on Monday, February 22, 2016 | 2/22/2016


10 రోజుల కిందటే అపాయింట్ మెంట్ కోరాం..
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో వైఎస్సార్ సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భేటీ ఖరారయింది. రేపు(మంగళవారం) సాయంత్రం 6 గంటలకు వైఎస్ జగన్ రాష్ట్రపతిని కలుస్తారని,  రాష్ట్రంలో నెలకొన్న సమస్యలు, పాలనలో అవినీతిపై ఫిర్యాదుచేయడంతోపాటు ప్రత్యేక హోదా తదితర అంశాలను నివేదిస్తారని చెప్పారు.

'నిజానికి 10 రోజుల కిందటే రాష్ట్రపతి, ప్రధానమంత్రుల అపాయింట్ మెంట్ కోరాం. రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అవుతాయి. ఈ సమావేశాల్లోనైనా ఏపీకి ప్రత్యేక హోదా అంశం చర్చకు రావాలని మేం కోరుతున్నాం. అందుకే సమావేశాల ప్రారంభానికి ముందే వారిని కలవాలనుకున్నాం' అని వైఎస్సార్ సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సోమవారం రాత్రి ఢిల్లీలో పేర్కొన్నారు.వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనపై కొన్ని ఛానెళ్లు పనిగట్టుకుని దుష్ప్రచారం సాగిస్తున్నాయని, అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయని వైవీ మండిపడ్డారు.
Share this article :

0 comments: