6 వేల కోట్ల లూటీ స్కీమ్! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 6 వేల కోట్ల లూటీ స్కీమ్!

6 వేల కోట్ల లూటీ స్కీమ్!

Written By news on Monday, February 15, 2016 | 2/15/2016


ఇది బరితెగింపే!
అక్షరాలా 6 వేల కోట్ల లూటీ స్కీమ్...

♦ ‘అంచనాల పెంపు’కోసం అడ్డదారులు..
♦ చినబాబు, పెదబాబు కనుసన్నల్లో పక్కావ్యూహం
♦ ‘సాగునీటి’ కుంభకోణంలో ఎన్నెన్నో విచిత్రాలు

 సాక్షి, హైదరాబాద్: హంద్రీ-నీవా, గాలేరు-నగరిలో అంచనాల పెంపు వ్యవహారంలో అప్పనంగా రూ.6 వేల కోట్లు కొట్టేయడానికి సర్కా రు పెద్దలు బరితెగించారు. ఇద్దరు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు తిరస్కరించిన ‘అంచనాల పెంపు’ వ్యవహారంలో అడుగడుగునా జరిగిన నిబంధనల ఉల్లంఘనలు, ప్రజాధనా న్ని బొక్కేయడానికి అధికారపార్టీ నేతలు పన్ని న పన్నాగం ఉన్నతస్థాయి అధికారుల్ని విస్మయపరిచింది. ‘చినబాబు’, ‘పెదబాబు’ కనుసన్నల్లో సాగిన ఈ అవినీతి బాగోతానికి సోమవారం జరగనున్న మంత్రివర్గ సమావేశంలో ఆమోదముద్ర వేయడానికి రంగం సిద్ధమైంది. ఇద్దరు సీఎస్‌లు తిరస్కరించినా సరే.. మళ్లీ మంత్రివర్గానికి ఫైలును పంపుతున్నారంటేనే ఇందులో ప్రభుత్వ పెద్దల పాత్ర ఎంత ఉందో అర్థమవుతోంది.

కేబినెట్‌లో ఆమోదం ద్వారా ఏదోవిధంగా అవినీతి బాగోతానికి నీతి పూత వేయకపోతే క్షేత్రస్థాయి అధికారుల నుంచి ప్రభుత్వ పెద్దలవరకు అందరూ కుంభకోణం లో ఇరుక్కుపోతామనే భయం వెంటాడుతోం దని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. హంద్రీనీవా సుజల స్రవంతి(హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్), గాలేరు-నగరి సుజల స్రవంతి(జీఎన్‌ఎస్‌ఎస్), గోరకల్లు ప్రాజెక్టుల్లో 25 ప్యాకేజీల్లో మిగిలిపోయిన పనుల్ని విడదీసి, వాటి అం చనా వ్యయాన్ని భారీగా పెంచి అయినవారికి కాంట్రాక్టులు కట్టబెట్టడం ద్వారా సాగించిన ఈ రూ.6 వేల కోట్ల కుంభకోణంలో నిబంధనల ఉల్లంఘన యధేచ్ఛగా కొనసాగింది.

 అదనపు చెల్లింపుల అవసరమే లేదు
 ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్‌స్ట్రక్షన్(ఈపీసీ) విధానం లో మంజూరు చేసిన కాంట్రాక్టుల్లో అదనపు చెల్లింపులు చేయాల్సిన అవసరమే లేదు. ఇదే విషయాన్ని పలుమార్లు ఆర్థికశాఖ స్పష్టం చేసింది. హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్, జీఎన్‌ఎస్‌ఎస్‌లో అన్ని ప్యాకేజీలు ఈపీసీ విధానంలో మంజూరు చేసిన కాంట్రాక్టులే. అదనపు చెల్లింపులకు అవకాశం లేకపోయినా, అధికార పార్టీ నేతల పైరవీలతో అదనపు చెల్లిం పులు చేయడానికి వీలుగా ప్రభుత్వం రెండు జీవోలు(22, 63) తీసుకొచ్చింది. వీటి ఆధారంగా చేసిన చెల్లింపుల్లో భారీ చేతులు మారాయని జలవనరులశాఖలో ప్రచారం సాగుతోం ది. ప్రభుత్వ పెద్దల అవినీతి అంతటితో ఆగలేదు. గాలేరు-నగరి, హంద్రీ-నీవాలో పనులు విడదీసి, వాటి అంచనాలు పెంచి సొమ్ము చేసుకోవాలనే ఆలోచన వచ్చింది. చినబాబు ఆశీ స్సులు, పెదబాబు సహకారం ఉండటంతో.. నిబంధనలను తుంగలో తొక్కి.. ‘అంచనాల పెంపు’లో నొక్కేయడానికి స్కెచ్ వేశారు.

 స్కెచ్ అమలు చేసిందిలా..
► కాంట్రాక్టు మంజూరైనప్పుడే కాంట్రాక్టర్-ప్రభుత్వం మధ్య ఒప్పందం ఉంటుంది. పనులు చేయడంలో జాప్యం జరిగినా, చేసే సత్తా లేక చేతులెత్తేసినా.. ప్రభుత్వం సదరు కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవడానికి అవకాశముంటుంది. పనులు చేయకపోవడానికి ప్రభుత్వమే కారణమైతే తప్ప.. మిగతా సందర్భాల్లో పనులు చేయకపోతే కాంట్రాక్టర్‌ను బ్లాక్‌లిస్టులోనూ పెడతారు. కానీ జీఎన్‌ఎస్‌ఎస్, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌లోని 25 ప్యాకేజీల్లో ఒక కాంట్రాక్టర్‌పైనా చర్యలు తీసుకోకుండానే.. మిగిలిపోయిన పనుల్ని విడదీశారు.

► కాంట్రాక్టర్-ప్రభుత్వం మధ్య విభేదాలు తలెత్తడానికి కారణమైన పనులు, అనవసర క్లెయిములు వచ్చిన పనుల్ని విడదీయడానికి ఒప్పందంలోని 60-సి నిబంధన అవకాశం కల్పిస్తుంది. కాగా 25 ప్యాకేజీల్లోనూ 60-సి కిందే పనుల్ని విడదీశారు. అయితే ఒక్క ప్యాకేజీలోనూ కాంట్రాక్టర్-ప్రభుత్వం మధ్య 60-సి నిబంధనకు అవకాశం కల్పించే ఒక్క అంశమూ లేకపోవడం గమనార్హం.

► 60సి నిబంధన కింద విడదీసిన పనుల అంచనా వ్యయం 5 శాతం కంటే మించితే ప్రభుత్వ అనుమతి తీసుకోవడం తప్పనిసరి. కానీ అలాంటిదేమీ లేకుండానే అంచనాలను భారీగా పెంచేశారు. తద్వారా ఈ నిబంధనకు తూట్లు పొడిచారు. ఈ నిబంధనను తుంగలో తొక్కడానికి మంత్రివర్గం వీలు కల్పిస్తే.. అడ్డగోలు అవినీతి వ్యవహారాలు జలవనరుల శాఖకే పరిమితం కావు. కాంట్రాక్టు పనులున్న అన్ని శాఖల్లోనూ అవినీతికి రాజముద్ర వేసినట్లేనని ఇంజనీర్లు పేర్కొంటున్నారు.
► కాంట్రాక్టర్ వైపు తప్పుంటే.. 61 నిబంధన కింద పనుల్ని విడదీయడానికి వీలుంటుంది. అయితే విడదీసిన పనికయ్యే ఖర్చును సదరు కాంట్రాక్టర్ నుంచి రికవరీ చేయాల్సి ఉంటుం ది. అయితే 25 ప్యాకేజీల్లో ఒక్కచోట కూడా 61 నిబంధన కింద విడదీయలేదు. 25 ప్యాకేజీల్లో అధికార పార్టీ ఎంపీ సీఎం రమేష్, లేదా టీడీపీ నేతలు, వారి బినామీలు కాంట్రాక్టర్లు లేదా సబ్ కాంట్రాక్టర్లుగా ఉన్నా రు. తాజాగా అంచనాలు పెంచి టెండర్లు పిలి చిన తర్వాత.. పాత ప్యాకేజీలో కాంట్రాక్టర్ అయితే ఇప్పుడు సబ్ కాంట్రాక్టర్‌గా, పాత ప్యాకేజీలో సబ్ కాంట్రాక్టర్ అయితే ఇప్పుడు కాంట్రాక్టర్‌గా అవతారం మార్చారు. 61వ నిబంధన కింద రికవరీ అంటే.. అధికారపార్టీ నేతల నుంచే చేయాల్సి ఉంటుంది. అందువల్లే చేయలేదు.
► ఉదాహరణకు జీఎన్‌ఎస్‌ఎస్ 29 ప్యాకేజీలో రూ.12 కోట్ల విలువైన పనిని విడదీసి అంచనా వ్యయాన్ని రూ.110 కోట్లకు పెంచారు. 29వ ప్యాకేజీ ఒరిజినల్‌గా మైటాస్-ఎన్‌సీసీ జేవీకి వచ్చింది. అందులో సీఎం రమేష్ సబ్ కాంట్రాక్టర్‌గా ఉన్నారు. 29వ ప్యాకేజీలో పనులకు చెల్లించిన చెక్కులన్నీ సీఎం రమేష్‌కు చెందిన కంపెనీకే వెళ్లాయని జలవనరులశాఖ అధికారులు చెబుతున్నారు. పెంచిన అంచనాల తర్వాత ‘29-ఎ’ ప్యాకేజీ పేరు మార్చి టెండర్లు పిలిస్తే సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ ప్రాజెక్ట్స్‌కు పనులు దక్కాయి. 4.9 శాతం ఎక్సెస్‌కు.. అంటూ 115.4 కోట్లకు దక్కించుకున్నారు. అంటే రూ.12 కోట్ల పనిని రూ.115.4 కోట్లకు కొట్టేశారన్నమాట.

 మరో 15 ప్యాకేజీల పనులు కొట్టేసేందుకు రంగం సిద్ధం..
 ఇదిలా ఉండగా 25 ప్యాకేజీల్లో అలా కొట్టేసిన అధికారపార్టీ నేతలు, మరో 15 ప్యాకేజీల్లోనూ ఇదేవిధంగా కొట్టేయడానికి రం గం సిద్ధం చేశారు. అంచనాల పెంపునకు మంత్రివర్గం ఆమోదం తెలిపిన వెంటనే.. ఆ 15 ప్యాకేజీల పనుల్ని జలవనరుల శాఖ వారికి కట్టబెట్టేయనుంది. అంటే అవినీతి పందేరం.. 25 ప్యాకేజీలతో ఆగిపోదు. మంత్రివర్గం రాజముద్ర పడితే.. అందిన కాడికి దోచుకోవడానికి అధికారపార్టీ నేతలు సిద్ధంగా ఉన్నారు.

 ధరల్లో భారీ తేడా...
 ఒకే రకమైన పనుల్లో పాత కాంట్రాక్టర్లకు చెల్లిస్తున్న ధరలకు, అంచనాలు అడ్డగోలుగా పెంచి నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు పిలిచి అధికారపార్టీ నేతలకు కట్టబెట్టిన పనులకు ఇస్తున్న ధరలకు అసలు పొంతనే లేదు. పాత కాంట్రాక్టర్ల కంటే రెండు నుంచి మూడు రెట్లు అధికంగా ఇస్తున్నారు. వాస్తవానికి నిర్మాణంలో అధికంగా వాడే ఇంధనం, స్టీలు ధరలు గణనీయంగా తగ్గాయి. కానీ పనులకిస్తున్న ధరలు మాత్రం అమాంతం పెంచేశారు. మట్టిపని నుంచి కాంక్రీట్ వరకు ధరల్లో చాలా తేడా ఉండటం గమనార్హం.
Share this article :

0 comments: