
తన కుటుంబానికి సన్నిహితులైన వ్యక్తులను ప్రలోభాలు పెట్టి, డబ్బులు, మంత్రి పదవులు ఎరచూపి తీసుకొనిపోవడం తనకు బాధ అనిపించిందని వైఎస్ జగన్ అన్నారు. 'నాగిరెడ్డి అన్న విషయంలో బాధ అనిపించింది. బాగా దగ్గరగా ఉన్న మనుషులను, కుటుంబంలోని సభ్యులు అనుకున్నవారు అలా వెళ్లడం బాధ కలిగించింది. శోభమ్మ చనిపోయినప్పుడు, అలాగే ఆమె మొదటి వర్ధంతి సందర్భంలో అమ్మ, నేను, నా భార్య భారతి, చెల్లెలు షర్మిల అందరం కలిసివెళ్లాం. అంతగా కుటుంబసభ్యుడిగా ఆయనను భావించాం. అలాంటి వ్యక్తిని కూడా ప్రలోభాలు పెట్టి తీసుకు వెళ్లారు.' అని జగన్ అన్నారు.
పార్టీ ఎమ్మెల్యేలందరినీ ప్రలోభపెట్టి, డబ్బు ఎరచూపి, మంత్రులతో మంతనాలు జరిపి.. కుదరకపోవడంతో చంద్రబాబు తానే స్వయంగా రంగంలోకి దిగి గట్టిగా కష్టపడినా కేవలం నలుగురు అంటే నలుగురు ఎమ్మెల్యేలు మాత్రమే పార్టీ మారారన్నారు. ఎన్ని ప్రలోభాలు, ఆశలు, బెదిరింపులకు పాల్పడినా ప్రజాపక్షం వహించి వైఎస్ఆర్‌సీపీతోనే ఉన్న 62 మంది ఎమ్మెల్యేలకు వైఎస్ జగన్ హ్యాట్సాప్ చెప్పారు.
ఇక ఎన్నికల సందర్భంగా ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఒక్క హామీనైనా నెరవేర్చలేదని, ఊరికి రెండు కొత్త ఇళ్లు కూడా నిర్మించి ఇవ్వలేదని, అలాంటి వ్యక్తితో కలిసి వెళ్లినందుకు పార్టీ మారిన ఆ నలుగురు ఎమ్మెల్యేలు తమను తాము మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలని జగన్ సూచించారు.
0 comments:
Post a Comment