సీఎంపై ‘అట్రాసిటీ’ కేసు పెట్టాలి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సీఎంపై ‘అట్రాసిటీ’ కేసు పెట్టాలి

సీఎంపై ‘అట్రాసిటీ’ కేసు పెట్టాలి

Written By news on Wednesday, February 10, 2016 | 2/10/2016


సీఎంపై ‘అట్రాసిటీ’ కేసు పెట్టాలి
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల డిమాండ్

 సాక్షి, హైదరాబాద్: దళితులను కించపరుస్తూ వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ పదవిలో ఉండటానికే అనర్హుడని, ఆయనపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసును నమోదు చేయాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు కొరుముట్ల శ్రీనివాసులు, యక్కలదేవి ఐజయ్య డిమాండ్ చేశారు. ‘ఎవరైనా ఎస్సీలుగా పుట్టాలని కోరుకుంటారా?’ అని ఆయన అనడం సిగ్గుచేటని వారు మండిపడ్డారు. ‘చంద్రబాబుకు దళితులంటే అంత చులకనా?’ అంటూ ధ్వజమెత్తారు.

ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు చంద్రబాబు అంబేడ్కర్ విగ్రహం కాళ్లు పట్టుకుని ఎస్సీలందరికీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేకుంటే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. మంగళవారం వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథితో కలసి వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాజ్యాంగపరంగా సంక్రమించిన ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి దళితులను కించపరిచే విధంగా మాట్లాడ్డం చూస్తే ఆయన మనసులో వారి పట్ల ఉన్న వివక్ష ఏంటో ఇట్టే తెలిసిపోతోందని అన్నారు.

 కులాల మధ్య బాబు చిచ్చు
 దళితులను కించపర్చేలా వ్యాఖ్యలు చేయడం చంద్రబాబు దురహంకారానికి నిదర్శనమని పార్థసారథి విమర్శించారు. కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని, వివిధ కులాలకు వందల కోట్లు కేటాయిస్తామని టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు వాటిని నెరవేర్చే ప్రయత్నం చేయకపోగా కులాల కుంపటి రగిలిస్తున్నారని విమర్శించారు. ఓవైపు కాపులకు రిజర్వేషన్ ఇస్తానని చెబుతూనే మరోవైపు తమ పార్టీ ఎమ్మెల్యేతో అందుకు వ్యతిరేకంగా ఉద్యమం చేయిస్తూ కులాల మధ్య చిచ్చు పెడుతున్నది చంద్రబాబేనన్నారు.
Share this article :

0 comments: