గేట్లు తెరిస్తే మిగిలేది వారిద్దరే! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » గేట్లు తెరిస్తే మిగిలేది వారిద్దరే!

గేట్లు తెరిస్తే మిగిలేది వారిద్దరే!

Written By news on Saturday, February 13, 2016 | 2/13/2016


గేట్లు తెరిస్తే  మిగిలేది వారిద్దరే!
లోకేష్ వ్యాఖ్యలకు వైఎస్సార్ సీపీ  జిల్లా అధ్యక్షుడు అమర్‌నాథ్‌ ఖండన
తెలంగాణలో టీడీపీని కాపాడుకోలేక అసత్య ప్రచారాలు

 
నక్కపల్లి: ఏపీలో తెలుగుదేశం పార్టీ గేట్లు తెరిస్తే తెలంగాణలో పరిస్థితే ఏర్పడుతుందని పార్టీలో చంద్రబాబునాయుడు, లోకేష్ తప్ప ఎవరూ మిగలరని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. శుక్రవారం ఆయన నక్కపల్లిలోని పార్టీ కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడుతూ వైఎస్సార్ సీపీపై నారా లోకేష్ వ్యాఖ్యలను  ఖండించారు. ముందు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలపై అసత్య ప్రచారం మానుకుని తెలంగాణలో టీడీపీని కాపాడుకుంటే చాలునని పేర్కొన్నారు. తెలంగాణలోని టీడీపీ ఎమ్మెల్యేలంతా టీఆర్‌ఎస్‌లో చేరటం ఖాయమని అమర్‌నాథ్ అంటూ అక్కడ పార్టీని, ఎమ్మెల్యేలను కాపాడుకోవడం చేతకాక  ఏపీలో  ైవె ఎస్సార్‌సీపీని అస్థిర పరిచే విధంగా చంద్రబాబునాయుడు, లోకేష్ వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. 2019లో అధికారం వైఎస్సార్‌సీపీదేనని స్పష్టం చేశారు. ఏ ఒక్కరూ పార్టీని వీడే ప్రసక్తి లేదన్నారు. హైదరాబాదర్ గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల తీర్పు టీడీపీకి చెంపపెట్టన్నారు. దీనికి సిగ్గుపడకుండా  తండ్రి కొడుకులిద్దరూ ఏపీలో ఉత్తర ప్రగల్భాలు పలుకుతున్నారన్నారు.

ఎన్నికల్లో ఇచ్చిన రుణమాఫీ, నిరుద్యోగ భృతి, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ, కాపులను బీసీల్లో చేర్చడం, ఇంటికో ఉద్యోగం వంటి హమీలు నెరవేర్చకపోవడంతో తగినగుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. పార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి గొల్ల బాబూరావు మాట్లాడుతూ తెలంగాణలో సైకిల్‌కు పంక్చర్ అయిందని, ఏపీలో యాక్సిడెంట్ అవడం ఖాయమన్నారు. తెలంగాణ ప్రజలు టీడీపీని వదిలించుకుంటున్నారని, ఏపీ ప్రజలు ఎప్పుడు వదిలించుకోవాలా అని చూస్తున్నారన్నారు. సమావేశంలో పార్టీ సీజీసీ సభ్యుడు వీసం రామకృష్ణ, గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల నాగిరెడ్డి,పీఏసీఎస్ అధ్యక్షుడు మధువర్మ, ఎంపీటీసీ వెలగా ఈశ్వరరావు,  సర్పంచ్‌లు సూరాకాసుల గోవిందు, కొర్లయ్య పాల్గొన్నారు.
 
Share this article :

0 comments: