చంద్రబాబు లాంటి మోసగాడు దేశంలోనే లేడు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చంద్రబాబు లాంటి మోసగాడు దేశంలోనే లేడు

చంద్రబాబు లాంటి మోసగాడు దేశంలోనే లేడు

Written By news on Sunday, February 14, 2016 | 2/14/2016


చంద్రబాబు లాంటి మోసగాడు దేశంలోనే లేడు
♦ చంద్రబాబు మోసాలపై వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజం
♦ మాకొద్దీ సీఎం అని జనం అంటున్నారని ఎద్దేవా
♦ సీఎం అంటే ఎలా ఉండాలో వైఎస్ చాటిచెప్పారు
♦ సంక్షేమ పథకాలతో జనం గుండెల్లో నిలిచిపోయారు
 సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : ముఖ్యమంత్రి చంద్రబాబు లాంటి మోసగాడు దేశంలోనే లేడని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. సీఎం అంటే ఇలా ఉండాలని రాష్ట్రానికే కాక దేశానికి చాటిచెప్పేలా సంక్షేమ పథకాల్ని దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి అమలు చేశారని ఆయన గుర్తుచేశారు. అందుకే ఆయన ప్రజల గుండెల్లో నిలిచిపోయారని అన్నారు. చంద్రబాబు పరిపాలన ఎలా ఉంది? అని ఎవరిని అడిగినా మోసం..మోసం అంటున్నారన్నారు. మా కొద్దు బాబోయ్ ఇలాంటి సీఎం అని జనం గగ్గోలు పెడుతున్నారన్నారు.
శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా వైఎస్ జగన్ శనివారం ఎచ్చెర్ల నియోజకవర్గం పైడిభీమవరం, పతివాడపాలెం ప్రాంతాల్లో వైఎస్ విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ చంద్రబాబు పరిపాలన గూర్చి రైతన్నల్ని అడిగితే ‘ఎన్నికలకు ముందు రుణాల్ని బేషరతుగా మాఫీ చేస్తామని చెప్పారు. బ్యాంకులో ఉన్న బంగారం ఇంటికి రావాలంటే బాబు రావాలన్నారు. ఇప్పుడేమో బ్యాంకుల నుంచి నోటీసులందుకుంటున్నాం’ అంటూ బాధపడుతున్నారని వివరించారు. డ్వాక్రా అక్కచెల్లెమ్మల్ని అడిగితే ‘గతంలో పావలా వడ్డీకే రుణాలు దొరికేవి. ఇప్పుడు బ్యాంకులకు రూ.2 వడ్డీ కట్టాల్సివస్తోంది’ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారని జగన్ చెప్పారు. విద్యార్థులు, యువకుల్ని సీఎం పాలన గురించి అడిగితే ‘బాబొస్తే జాబొస్తుందన్నారు. ప్రస్తుతం ఉన్న ఉద్యోగం ఊడగొడుతున్నారు. నిరుద్యోగులకు ప్రతినెలా రూ.2 వేలు భృతి ఇస్తామన్నారు.
రాష్ట్రంలో ఇప్పటివరకు ఎవరికీ భృతి ఇవ్వలేదు.’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని జగన్ వివరించారు. ‘ఎన్నికల ముందు అందరికీ ఇళ్లన్నారు. ఇప్పుడడిగితే లేవంటున్నారు. చంద్రబాబు పాలన ఎలా ఉంది అనేది మూడు ముక్కల్లో చెప్పాలంటే మోసం..మోసం..మోసం’ అని జగన్ ఎద్దేవా చేశారు.  ‘ఇంత మోసపూరిత పాలన ఎప్పుడూ చూడలేదు. ఎన్నికల ముందు ఏ టీవీ చూసి నా, పత్రికల్లోనూ ప్రకటనలిస్తూ మోసపూరిత హామీలతో ప్రజలను ప్రలోభ పెట్టారు’ అని  దుయ్యబట్టారు. ‘అందుకే ఇప్పటికీ వైఎస్ పరి పాలనను మరచిపోలేకపోతున్నామని ప్రజలు చెబుతున్నారు. వైఎస్‌పై గుండెల నిండా ప్రేమ ను నింపుకున్నారు.’ అని జగన్ పేర్కొన్నారు.
వంశధార నిర్వాసితులకు అండగా పోరాడతాం
వంశధార ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావిస్తామని, పరిష్కారమ య్యే వరకు వారికి అండగా పోరాడతామని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా హిర మండలంలోని బ్యారేజీ కూడలి వద్ద గత 25రోజులుగా రిలే నిరాహార దీక్షలకు కూర్చున్న వంశధార ప్రాజెక్టు నిర్వాసితుల దీక్షా శిబిరాన్ని జగన్ సందర్శించారు. నిర్వాసితులకు సంఘీభావం ప్రకటించి కొద్దిసేపు వారి వద్ద కూర్చున్నారు. ఈ సందర్భంగా వృద్ధులు, వికలాంగులు, నిర్వాసితు ల సంఘ ప్రతినిధులు తామెదుర్కొంటున్న సమస్యల్ని జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ పోలవ రం, పట్టిసీమ ప్రాజెక్టులతో పోల్చితే వంశధార రిజర్వాయర్ చాలా చిన్న ప్రాజెక్టేనని, కేవలం 7,100 కుటుంబాలే నిర్వాసితులుగా ఉన్నారన్నారు.
వారి సమస్యలు పరిష్కరించడంలో కూడా ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. నిర్వాసితుల కోసం అమలు చేయాల్సిన చట్టంలోని లొసుగులు వెతుకుతున్నారే తప్ప పూర్తి స్థాయి పునరావాసం కల్పించి ఆదుకుందామన్న ధ్యాస పాలకుల్లో లేకుండా పోయిందన్నారు. పదేళ్ల క్రితం ధరల ప్రకారం ఇంటికి రూ.53 వేలు, ఎకరా భూమికి రూ.1లక్షా 30వేలు ఇవ్వడం ఎంతవరకు సబబో పాలకులే చెప్పాలన్నారు. వంశధార ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలపై అసెంబ్లీలో గట్టిగా పోరాడతామని జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు.
పునరావాసం కల్పించి, ప్యాకేజీలు చెల్లించిన తర్వాతే ప్రాజెక్టు పనులు పూర్తిచేయాలన్నారు. 80శాతం పనులు పూర్తయితే 100శాతం పునరావాసం కూడా పూర్తి కావాలన్నారు. ప్రభుత్వంతో పోరాడి సమస్యలు పరిష్కరించుకుందామన్నారు. ప్రభుత్వం పట్టించుకోకపోతే ‘మనం అధికారంలోకి వచ్చిన తరువాత మెరుగైన పరిహారం, పునరావాసం కల్పించి పనులు పూర్తి చేసుకుందాం’ అని నిర్వాసితులకు హామీ ఇచ్చారు. కాగా జగన్‌కు మాతల తదితర ప్రాంతాల్లో భారీ ఎత్తున ప్రజలు స్వాగతం పలికారు.
Share this article :

0 comments: