
♦ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి
♦ అభ్యర్థులతో కలిసి ఇంటింటి ప్రచారం
♦ అభ్యర్థులతో కలిసి ఇంటింటి ప్రచారం
ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 35,49, 50 డివిజన్లలో ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి విస్తృతంగా పర్యటించారు. ఇంటింటి ప్రచారం నిర్వహించి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. పలు ప్రాంతాల్లో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుతో కలిసి పాదయాత్ర నిర్వహించారు.
ఖమ్మం : కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులను గెలిపిస్తే.. డివిజన్‌లను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. నగరంలోని 35,49,50 డివిజన్లలో పోటీ చేస్తున్న గుండపూడి జయమ్మ, గుండ్ల రవికుమార్, పీట్ల పార్వతమ్మను గెలిపించాలని కోరుతూ శుక్రవారం ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ పొంగులేటి, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు 35వ డివిజన్‌లోని రాపర్తినగర్ ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు చేశారు. రాజీవ్‌నగర్, బుర్హాన్‌పురం చెరువు కట్ట, వాటర్ ట్యాంక్ ఏరియా, రామాలయం వీధుల్లో ఇంటింటి ప్రచారం చేశారు. దినసరి కూలీలు, చాట్ బండార్ వ్యాపారులు, కార్మికులు, గృహిణులను ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని కోరారు.
49వ డివి జన్ పరిధిలోని దానవాయిగూడెం, కాలనీల్లో గుండ్ల రవికుమార్ తరఫున, 50డివిజన్ పరిధిలోని ఎన్‌టీఆర్ కాలనీ, రామన్నపేట కాలనీ, రామన్నపేట ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం నిర్వ హించారు. ప్రచార కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, డివిజన్ ఇన్‌చార్జ్‌లు, పార్టీ వైరా నియోజకవర్గ ఇన్‌చార్జ్ బొర్రా రాజశేఖర్, జిల్లా అధికార ప్రతినిధి ముదిరెడ్డి నిరంజన్‌రెడ్డి, నాయకులు గుండపనేని నాగేశ్వరరావు, ఉపేంద్ర, అజ్మీరా లింగరాజు, సూర్యం, సాయి, పాండు, కన్నేటి వెంకన్న, టీ.ఈశ్వరాచారి, ఎం.కృష్ణారెడ్డి, జీ.అరవింద్,కన్నేటి వెంకన్న, నాయకులు ఎస్‌కే సోందు, మద్దినేని శ్రీనివాసరావు, బల్లెం వీర స్వామి, పల్లపు వెంకన్న, మంగల సుమన్ పాల్గొన్నారు.
0 comments:
Post a Comment