నెల్లూరు టీడీపీ త్వరలో ఖాళీ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » నెల్లూరు టీడీపీ త్వరలో ఖాళీ

నెల్లూరు టీడీపీ త్వరలో ఖాళీ

Written By news on Wednesday, February 17, 2016 | 2/17/2016


నెల్లూరు టీడీపీ త్వరలో ఖాళీ
హైదరాబాద్ : భవిష్యత్ అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే అని నెల్లూరు లోక్ సభ సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. బుధవారం నగరంలోని లోటస్ పాండ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో నెల్లూరు జిల్లాకు చెందిన ఆనం విజయ్ కుమార్ రెడ్డి పార్టీలో చేరారు. అనంతరం మేకపాటి రాజమోహన్ రెడ్డి మాట్లాడుతూ... నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా  బలోపేతమవుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై అన్ని వర్గాల ప్రజల్లోనూ అసంతృప్తిగా ఉందని చెప్పారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకోవాలని చంద్రబాబు చూస్తున్నారని మేకపాటి ఆరోపించారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలెవరూ టీడీపీలో చేరరని మేకపాటి స్పష్టం చేశారు.

ఆ తర్వాత ఆనం విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.... నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని తెలిపారు. జిల్లాలో పార్టీ మరింత బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లాలో టీడీపీ త్వరలో ఖాళీ అవుతుందని జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి, మరో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జోస్యం చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ప్రారంభమవుతాయన్నారు. ఆనం విజయ్ కుమార్ రెడ్డి చేరికతో జిల్లా పార్టీకి కొత్త ఉత్సాహానిస్తుందన్నారు.
Share this article :

0 comments: