ఆ పది వేల కోట్లు ఎవరి జేబుల్లోకి? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఆ పది వేల కోట్లు ఎవరి జేబుల్లోకి?

ఆ పది వేల కోట్లు ఎవరి జేబుల్లోకి?

Written By news on Friday, February 19, 2016 | 2/19/2016


ఆ పది వేల కోట్లు ఎవరి జేబుల్లోకి?
టీడీపీ సర్కారుపై ధ్వజమెత్తిన వైఎస్సార్‌సీపీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల వ్యయం పెంపులో అత్యధికంగా పెరిగిన రూ. పదివేల కోట్లు ఎవరి జేబుల్లోకి వెళుతున్నాయో వెల్లడించాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్థన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆయన గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో రూ.11 వేలకోట్ల వ్యయం కాగల సాగునీటి ప్రాజెక్టుల వ్యయాన్ని రూ.24 వేల కోట్లకు పెంచాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇంత పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అని సూటిగా ప్రశ్నించారు.

ప్రాజెక్టు పనుల వ్యయం మీద 40 శాతం పెంపు ఇవ్వడానికే ప్రభుత్వం జీవో-22ను విడుదల చేసిందన్నారు. పెరిగిన ధరల ప్రకారం రూ.11 వేల కోట్ల ప్రాజెక్టుల వ్యయం మహా అయితే రూ.14 వేల కోట్లకు పెరుగుతుంది గానీ ఏకంగా రూ.24 వేల కోట్లకు ఎలా పెరుగుతుందన్నారు. ఇలా అప్పనంగా పెంచేసిన రూ.10 వేల కోట్లు ఎవరి జేబులోకి పోతున్నాయి? ఎవరు నొక్కేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. చిన్నబాబు డెరైక్షన్... పెద్ద బాబు యాక్షన్‌తోనే వ్యయం పెంపుదల జీవోలు జారీ అవుతున్నాయని ధ్వజమెత్తారు.

ఇద్దరు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు సంతకాలు చేయడానికి నిరాకరించినా మంత్రివర్గంలో పెట్టి  తీసుకున్న ఈ నిర్ణయం పత్రికల్లో లీకైన తరువాత సాగునీటి శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పెంచడంలో తప్పేముంది అని సమర్థించుకోవడం చూస్తే ఈ ప్రభుత్వం నిస్సిగ్గుగా దోపిడీకి పాల్పడుతోందనేది అర్థం అవుతోందన్నారు. అవినీతి జరిగిందనడానికి తమ వద్ద ఆధారాలున్నాయని చెప్పారు.
 
టీడీపీ ఎంపీలకు దోచిపెడుతున్నారు : హంద్రీ-నీవా సుజల స్రవంతి ప్రాజెక్టులోని 26, 27, 28 ప్యాకేజీల పనులకు ఇప్పటికే ఉన్న జీవో నెంబరు-22 ప్రకారం ఇచ్చిన పెంపునే వర్తింపజేస్తూ ఒక్క 29 ప్యాకేజీ పనుల వ్యయాన్ని మాత్రం అసాధారణంగా పెంచేశారన్నారు. మైటాస్-ఎన్‌సీసీ సంస్థలు జాయింట్‌వెంచర్‌గా దక్కించుకున్న ఈ 29వ ప్యాకేజీ పనులను టీడీపీ రాజ్యసభ సభ్యుడు,సీఎంకు  సన్నిహితుడు అయిన సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ సంస్థ చేస్తున్నదని, ఆయనకు అప్పనంగా దోచి పెట్టేందుకే రూ.12కోట్ల వ్యయాన్ని ఏకంగా రూ.115.4 కోట్లకు పెంచేశారని గోవర్థన్ దుయ్యబ ట్టారు.

పోలవరం ప్రాజెక్టు హెడ్‌వర్క్స్ వ్యయాన్ని కూడా రూ.4000 కోట్ల నుంచి రూ.7000 కోట్లకు పెంచారని, ప్రాజెక్టు మొత్తం వ్యయాన్ని మళ్లీ రూ.16 వేల కోట్ల నుంచి రూ.32 వేల కోట్లకు పెంచి టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కంపెనీ ట్రాన్స్‌ట్రాయ్‌కు దోచి పెడుతున్నారని చెప్పారు.
 
అధికారులూ జాగ్రత్త : రాష్ట్రంలో ఇప్పటికే 25 సాగునీటి ప్రాజెక్టుల వ్యయాన్ని అడ్డగోలుగా పెంచేశారని, ఇంకా 15 ప్రాజెక్టుల వ్యయాన్ని కూడా పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని గోవర్థన్‌రెడ్డి చెప్పారు. జీవో నెంబర్-22 ప్రకారం ఇప్పటికే పెంచింది చాలక అప్పనంగా తన వారికి దోచిపెట్టి తానూ నొక్కేందుకే  చంద్రబాబు అత్యధికంగా పెంచేస్తున్నారని ఆరోపించారు. అధికారంలో ఉన్నవారు ప్రజాధనాన్ని దోచుకోవడానికి ఇలాంటి అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటే అందుకు అధికారులు ఆమోదముద్ర వేస్తే వారు ఇరుక్కు పోతారని హెచ్చరించారు.

అధికారులు నిబంధనల ప్రకారం వ్యవహరించాల్సి ఉంటుందని, వాటిని పక్కనబెట్టి కనుక నిర్ణయాలు తీసుకుంటే  విచారణ జరిగినపుడు ఇబ్బందులు పడాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వంలో ఉన్న వాళ్లు తాము చేయదల్చుకున్నది చేసి వెళ్లి పోతారని, జవాబుదారీగా మిగిలేది అధికారులేనని హెచ్చరించారు. తాము ఎన్ని సార్లు విమర్శించినా ప్రభుత్వం నిస్సిగ్గుగా తాను చేయాలనుకున్నది చేసుకుంటూ పోతోందన్నారు. ఈ దోపిడీని అరికట్టేందుకు తమ పార్టీ పోరాడుతుందన్నారు.
Share this article :

0 comments: