నేడు రాష్ట్రపతితో జగన్ భేటీ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నేడు రాష్ట్రపతితో జగన్ భేటీ

నేడు రాష్ట్రపతితో జగన్ భేటీ

Written By news on Tuesday, February 23, 2016 | 2/23/2016


నేడు రాష్ట్రపతితో జగన్ భేటీ
♦ ఢిల్లీ చేరుకున్న ప్రతిపక్షనేత
♦ రాష్ట్ర అంశాలపై నేడు కేంద్రానికి వినతులు

 సాక్షి, న్యూఢిల్లీ:  ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేలా కేంద్రానికి విన్నవించేందుకు రాష్ట్ర ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రెండు రోజుల పర్యటన కోసం ఢిల్లీ చేరుకున్నారు. సోమవారం మధ్యాహ్నం ఆయన పార్టీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, పీవీ మిథున్‌రెడ్డి, వైఎస్ అవినాశ్‌రెడ్డిలతో కలసి ఢిల్లీ వచ్చారు. రాష్ట్ర సమస్యలను పరిష్కరించాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు వివరించేందుకు పార్టీ అధ్యక్షుడు ఢిల్లీ వచ్చినట్టు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

మంగళవారం సాయంత్రం 6 గంటలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని వైఎస్ జగన్ కలవనున్నారని ఆయన వివరించారు. పది రోజుల క్రితమే అపాయింట్‌మెంట్ కోరామని, అపాయింట్‌మెంట్ ఖరారైతే  ప్రధానమంత్రి, హోంమంత్రిని కూడా మంగళవారం కలుస్తామని తెలిపారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని వైఎస్సార్‌సీపీ గడచిన ఏడాదిన్నరగా పోరాటం సాగిస్తోందని, ప్రత్యేక హోదాపై నీతి ఆయోగ్ సిఫారసు చేస్తుందని కొద్ది నెలల క్రితం కేంద్రం ప్రకటించినప్పటికీ ఆ దిశగా నేటికీ సానుకూల ఫలితం కనిపించలేదన్నారు. ఈ విషయాన్ని మరోసారి ప్రధాని దృష్టికి తీసుకెళ్లనున్నామని వివరించారు. అలాగే కాపులకు రిజర్వేషన్ల అమలు విషయంలో కేంద్రం చొరవచూపాలని, రిజర్వేషన్ల కోసం తలెత్తిన ఆందోళనలో నమోదైన కేసులను ఎత్తివేసేలా చూడాలని కోరునున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్ర స్థాయిలో గిరిజన సలహా మండలి ఏర్పాటు చేయాల్సి ఉండగా.. ఇప్పటివరకు ఏర్పాటు చేయలేదని, మండలి ఏర్పాటు జరిగేలా చర్య తీసుకోవాలని ప్రధానికి విన్నవించనున్నట్టు సమాచారం. కరువు ప్రాంతాల్లో కనీసం ఒక పంటకైనా కృష్ణా నది నీళ్లిచ్చేలా తగిన ఆదేశాలివ్వాలని కోరనున్నట్టు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

 అవాస్తవాల ప్రసారాలు తగవు
 జగన్ ఢిల్లీ పర్యటనపై కొన్ని చానళ్లు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయని, ఆ వార్తలన్నీ నిరాధారమని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో పేర్కొన్నారు. వ్యక్తిగత పనుల మీద ఢి ల్లీ రాలేదని, రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఢిల్లీ వచ్చారని తెలిపారు. రిజర్వేషన్ల కోసం జాట్ల ఆందోళన, తదితర ఇతర అంశాల వల్ల అపాయింట్‌మెంట్ ఖరారు కాకపోయి ఉండొచ్చని, సోమవారం సాయంత్రం కూడా ప్రధాని, హోంమంత్రి ఇదే చర్చలో ఉన్నారని ఆయన వివరించారు. కాగా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బడ్జెట్ సమావేశాలు ప్రారంభానికి ముందు ఢిల్లీ రానున్నారని, ప్రత్యేక హోదా, ఇతర అంశాలపై ప్రధానమంత్రి సహా పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారని పార్టీ లోక్‌సభాపక్ష నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి వారం క్రితమే ఇక్కడ మీడియాకు వెల్లడించారు. ప్రధానమంత్రి అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసిన రోజు మేకపాటి ఈ సంగతి విలేకరులకు తెలిపారు. అయితే అపాయింట్‌మెంట్ ఇంకా ఖరారు కాలేదని ఆయన అదేరోజు విలేకరుల వద్ద ప్రస్తావించారు.
Share this article :

0 comments: