హామీలు అమలయ్యేలా చూడండి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » హామీలు అమలయ్యేలా చూడండి

హామీలు అమలయ్యేలా చూడండి

Written By news on Wednesday, February 24, 2016 | 2/24/2016


హామీలు అమలయ్యేలా చూడండి
♦ ప్రత్యేక హోదా ప్రక్రియను వేగవంతం చేయాలి
♦ రాష్ర్టపతికి ప్రతిపక్ష నేత జగన్ వినతిపత్రం

 సాక్షి, న్యూఢిల్లీ: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ఢిల్లీలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో సమావేశయ్యారు. వివిధ అంశాలపై వినతిపత్రం సమర్పించారు. వినతిపత్రంలోని ముఖ్యాంశాలు...

► ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీలు, రాజ్యసభ సాక్షిగా ప్రధాని ఇచ్చిన హామీ ఇప్పటివరకు అమలు కాలేదు. ఏపీ ప్రభుత్వం చేసిన ప్రకటనలను ఆంధ్రప్రదేశ్‌ఖ 2019 వరకు రెవెన్యూ లోటు ఎదుర్కోనుందని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం 2014-15కు సంబంధించిన లోటును పూర్తిగా భర్తీ చేయలేదు.
► కడపలో స్టీలు ప్లాంట్, పెట్రో కెమికల్ కాంప్లెక్సు, విశాఖలో రైల్వేజోన్ అంశాల్లో పురోగతి లేదు. రాష్ట్రంలో ప్రధానమైన పరిశ్రమలు, పెట్టుబడులు ఇప్పటివరకు రాలేదు. అందువల్ల ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే ప్రక్రియను వేగవంతం చేయాలని నీతి ఆయోగ్‌కు సూచించండి. ప్రత్యేక హోదా ప్రతిపాదనను 2014 మార్చి 2న కేబినెట్ ఆమోదించింది. ప్రత్యేక హోదాను అమలు చేయాలని ప్రణాళిక సంఘాన్ని ఆదేశించింది.
► వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ ఇవ్వాల్సి ఉండగా కేంద్రం ఇప్పటివరకు రూ.700 కోట్లు మాత్రమే విడుదల చేసింది. బీఆర్‌జీఎఫ్ పథకాన్ని రద్దు చేసింది. మరోవైపు ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడులు, అభివృద్ధిని ఒకే ప్రాంతంలో కేంద్రీకరించే ైవె ఖరితో ఉంది. అందువల్ల రాజ్యసభలో ఇచ్చిన హామీ మేరకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ ఇవ్వాలి. ఉత్తరాంధ్ర, రాయలసీమను అభివృద్ధి చేయాలని కోరుతున్నాం.
► పోలవరం ప్రాజెక్ట్‌ను త్వరితగతిన పూర్తిచేయాలి.
► టీడీపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వైఎస్సార్‌సీపీ నేతలపై కేసులు పెడుతోంది. తుని సంఘటనలో మాత్రమే కాకుండా చిత్తూరు మేయర్ హత్యోదంతంలోనూ ఇలాగే వ్యవహరించింది.
► తుని సంఘటనపై దర్యాప్తు జరగకుండానే ఉద్దేశపూర్వకంగా వైఎస్సార్‌సీపీపై నెపం నెట్టడమే కాకుండా కడప, పులివెందుల వాళ్లు బాధ్యులంటూ పదేపదే ప్రకటనలు ఇస్తున్నారు.
► అధికార పార్టీ నేతలు కాల్‌మనీ-సెక్స్ రాకెట్, అక్రమ ఇసుక తవ్వకాలు, ప్రభుత్వ అధికారులపై దాడులకు పాల్పడుతున్నా చర్యలు లేవు. శేషాచలం కొండల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నారన్న ఆరోపణలపై కూలీలను కాల్చి చంపినా సమగ్ర దర్యాప్తు జరగలేదు. గోదావరి పుష్కరాల్లో తొలిరోజే 29 మంది భక్తులు చనిపోతే ఆ సంఘటనపై దర్యాప్తు జరగలేదు.
► ప్రభుత్వ అవినీతిపై, మేం చేసిన ఫిర్యాదులపై సిట్టింగ్ జడ్జితో గానీ, లేదా సీబీఐతోనైనా దర్యాప్తు జరిపించండి.
Share this article :

0 comments: