ప్రజలు ఛీ కొడతారు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రజలు ఛీ కొడతారు

ప్రజలు ఛీ కొడతారు

Written By news on Tuesday, February 23, 2016 | 2/23/2016

.

ప్రజలు ఛీ కొడతారు
ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి

 సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలను వారి నియోజకవర్గాల ప్రజలు ఛీకొట్టే రోజు వస్తుందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే, నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నలుగురు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరడంపై ఇప్పటికే చర్చనీయాంశమైందని, జరుగుతున్న పరిణామాలన్నింటినీ ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని హెచ్చరించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ఈ చర్య ఏ విధంగానూ ఉపయోగపడదని, పైగా అది వారి రాజకీయ తిరోగమానికి దారి తీస్తుందన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ఏ హామీ నిలబెట్టుకోలేక ప్రజల్లో పరపతిని కోల్పోతున్న చంద్రబాబు ఇలాంటి అనైతిక ఫిరాయింపులకు తెరతీశారని విమర్శించారు. ఎమ్మెల్యేలు ప్రజా తీర్పును అపహాస్యం చేసే విధంగా పార్టీలు మారడం ఎంత మాత్రం నైతికం కాదన్నారు. ఇలా చేసిన ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ ప్రజలను అవమానపర్చడమే అవుతుందన్నారు. పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలు వైఎస్సార్‌సీపీ నుంచి సంక్రమించిన పదవికీ, పార్టీకి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

 ఫిరాయించడం దారుణం: వెంకటరెడ్డి
 రాజకీయాల్లో నైతిక విలువలు నానాటికీ దిగజారి పోతున్నాయనడానికి తాజా ఫిరాయింపులే నిదర్శనమని మార్కాపురం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. నలుగురు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు పార్టీని వీడి టీడీపీలో చేరడాన్ని జంకె తీవ్రంగా తప్పు పట్టారు. ఈ ఎమ్మెల్యేలు ఎందుకు చేరారనేది అర్థం కావడం లేదని వారు చేరింది ప్యాకేజీల కోసమా, పదవుల కోసమా  ప్రజలకు సమాధానం చెప్పాలని అన్నారు.

 ప్రజల ఆకాంక్షను దెబ్బ తీయడమే..
 ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి ఫిరాయించడం అనేది వారి నియోజకవర్గాల్లోని ప్రజల ఆకాంక్షలను దెబ్బ తీయడమే అవుతుందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. మొన్నటి ఎన్నికల్లో ప్రజలు తమను ప్రతిపక్షంలో ఉండాలని తీర్పు ఇచ్చారని, ప్రజాపక్షంగా ఉండి ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడాల్సింది పోయి, అధికారం కోసం అర్రులు చాస్తూ టీడీపీలో చేరడమనేది అభ్యంతరకరమన్నారు.
Share this article :

0 comments: