చినబాబు.. కోటా! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చినబాబు.. కోటా!

చినబాబు.. కోటా!

Written By news on Thursday, February 25, 2016 | 2/25/2016



అధికారపార్టీ నేతల అరాచకం
60సీ కింద బాలాజీ రిజర్వాయర్పనుల విభజన
 స్లో ప్రోగ్రెస్ కింద  పాత కాంట్రాక్టర్‌పై వేటు
అధికారుల తీరుపై  సర్వత్రా విమర్శలు


జిల్లాలోని నీటి ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, కాలువ పనులను వాటాలు వేసి పంచుకుంటున్న అధికారపార్టీ నాయకులు మరో అక్రమానికి తెరతీశారు. గాలేరు-నగరి కాలువ పరిధిలోని బాలాజీ రిజర్వాయర్ పనులను చినబాబు అనుచరులకు అప్పగించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. గతంలో ఉన్న కాంట్రాక్టర్‌పై పనుల ఆలస్యం అనే నెపం నెట్టారు. అసలు విషయమేమంటే పనులు చేపట్టేందుకు పలు శాఖల నుంచి క్లియరెన్సులే రాలేదు. పనులూ ప్రారంభమే కాలేదు. అయినా పనులు ఆలస్యంగా నడుస్తున్నాయని  పేర్కొనడం కొసమెరుపు.

తిరుపతి తుడా: గాలేరు-నగిరి కాలువ పరిధిలోని బాలాజీ రిజర్వాయర్ పనులను అధికారపార్టీ సానుభూతి పరులకు  అప్పగించేందుకు రంగం సిద్ధమైంది. బాలాజీ రిజర్వాయర్ పనులను 60-సీ కింద విభజించి  చంద్రబాబు తనయుడు నారా లోకేష్ అనుయాయులైన మరో ఇద్దరికి కట్టబెట్టేందుకు అగ్రిమెంట్లు పూర్తయ్యాయి. మూడో కంటికి తెలియకుండా సంబంధిత అధికారులు ఈ పనులను చక్కబెట్టేశారు. పాత కాంట్రాక్టర్‌కు చెక్ పెడుతూ ఈ పనులు టీడీపీ నేతల చేతుల్లోకి వెళ్లాయి. 2007లో అగ్రిమెంట్ పొందిన హైదరాబాద్‌కు చెందిన ప్రోగ్రెసివ్ కన్‌స్ట్రక్షన్ జీఎన్‌ఎస్‌స్ 11వ ప్యాకేజీ కింద బాలాజీ రిజర్వాయర్ పనులను టెండర్ ద్వారా చేజిక్కించుకుంది.
2011 కల్లా బాలాజీ రిజర్వాయర్ పనులు పూర్తిచేయాల్సి ఉంది. అయితే నిర్మాణం చేపట్టాలంటే డీజీపీఎస్ సర్వే చేసి ఫారెస్ట్ అనుమతులు పొందాల్సి ఉంది. ఇప్పటికీ ఫారెస్టు అనుమతులు రాకపోవడం, నిధులు విడుదలలో పక్షపాతం వంటి అనేక కారణాలు వెంటాడటంతో బాలాజీ రిజర్వాయర్ పనులకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది.
ఫారెస్టు క్లియరన్స్ లేకపోవడం సంబంధిత అధికారులదే తప్పువుతుంది, కాంట్రాక్టర్‌ది ఎలాంటి తప్పులేకపోయినా స్లో ప్రోగ్రెసివ్ కింద పాత అగ్రిమెంట్‌ను నిలుపుదల చేస్తూ 60-సీ కి విభజించి మరో ఇద్దరికి (పీఎంఆర్, చెన్నకేశవ కన్‌స్టక్ష్రన్‌‌సకు) పనులను అప్పగించడంపై సర్వత్రా విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. దీనికితోడు రిజర్వాయర్ అంచనా వ్యయం రూ.125.55 కోట్లు కాగా.. తాజాగా మరో రూ.90 కోట్లను పెంచి కొత్త కాంట్రాక్టర్లకు ఇచ్చారనీ, ఇందులో చినబాబుకు భారీగా వాటా దక్కనున్నట్లు సమాచారం.

టెండర్‌కు వెళ్లకుండా.. 60సీ తెరపైకి
స్లో పోగ్రెస్ కింద పాత కాంట్రాక్టర్‌ను  నిలుపుదల చేస్తూ అదే అగ్రిమెంట్‌తో 60-సీ కింద పనులను మరో ఇద్దరికి అప్పగించేశారు. జీఎన్‌ఎస్‌ఎస్‌లో భాగమైన బాలాజీ రిజర్వాయర్ 11వ ప్యాకేజీ కిందకి వస్తుంది. 2007లో హైదరాబాద్‌కు చెందిన ప్రోగ్రెసీవ్ కంస్ట్రక్షన్స్ టెండర్ ద్వారా రూ.125.55 కోట్లతో పనులను దక్కించుకున్నారు.
స్లో ప్రోగ్రెస్ కింత పాత కాంట్రాక్టర్‌ను నిలుపుతూ అదే అగ్రిమెంట్ కింద మరో ఇద్దరికి పనులను అప్పగించారు. ప్రభుత్వం- కాంట్రాక్టర్‌ల మధ్య తలెత్తడానికి కారణమైన పనులు, అనవసర క్లైమ్‌లు వచ్చిన పనుల్ని విడదీయడానికి, స్లో ప్రోగెస్ (పనుల్లో జాప్యం) వంటి కారణాలు ఎదురైతే పనుల్ని విడదీసి మరొకరికి ఇవ్వడం కోసం 60-సీ నిబంధన తెరపై తీసుకొస్తారు.
ఈ నిబంధన బాలాజీ రిజర్వాయర్‌కు వర్తించకపోయినా చినబాబు అండతో60సీ తెరపైకి తీసుకొచ్చి పచ్చనేతలకు కట్టబెట్టారు. స్లో ప్రోగ్రెస్ ఉంటే టెండర్‌ను రద్దుచేసి మళ్లీ టెండర్‌కు వెళ్లాల్సి ఉంటుంది. 60-సీని అడ్డుపెట్టుకుని టెండర్‌కు వెళ్లకుండా అధికార పార్టీ నేతలకు మేలు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం బరితెగించింది. పాత టెండర్ పేరుతో ప్రస్తుతం పనులు అప్పగించినా, వాటి అంచాలను పెంచి కోట్ల రూపాయలు కొట్టేసేందుకు పెద్దకుట్ర జరుగుతోంది.
మార్చిలో జరిగే బడ్జెట్ సమావేశాల్లో జీఎన్‌ఎస్‌ఎస్‌కు నిధులు కేటాయించనుండటంతో చినబాబు తన అనుయాయులకు లబ్ధిచేకూర్చి తద్వారా సొమ్ముచేసుకునేందుకు ఈ కుంభకోణానికి తెరలేపారు. తిరుపతి డివిజన్ గాలేరు-నగరి చీఫ్ ఇంజనీరు ఈ అంశంపై సాక్షి వివరణ కోరగా.. సెలవులో ఉన్న కారణంగా తనకు పూర్తి సమాచారం తెలియదని అనారోగ్యం దృష్టా సెలవు పెట్టానని. రెండు రోజుల్లో పూర్తి వివరాలు చెబుతానని తెలిపారు.

స్లో పోగ్రెసివ్ ఎలా అవుతుంది
బాలాజీ రిజర్వాయర్ పనులు చేయాలంటే ఇతర శాఖలకు సంబంధించి ముందస్తు అనుమతులు ఉండాలి. 2011 కల్లా ఈ రిజర్వాయర్ పనులు పూర్తి చేయాల్సి ఉన్నా ఇప్పటికీ ఫారెస్టు అనుమతులు లేవు. అనుమతులు ఇవ్వకనే టెండర్ పిలిచి పనులను అప్పగించారు. ఆ తరువాతైనా అనుమతులు కోసం ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయలేదు. అసలు ప్రారంభమే కాని పనులకు స్లో పోగ్రెస్ అనే కారణంతో పాత కాంట్రాక్టర్‌కు చెక్ పెట్టి అగ్రిమెంట్‌ను రద్దు చేయడం గమనార్హం.
Share this article :

0 comments: