డామిట్ వ్యూహం బెడిసింది - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » డామిట్ వ్యూహం బెడిసింది

డామిట్ వ్యూహం బెడిసింది

Written By news on Tuesday, February 23, 2016 | 2/23/2016


డామిట్ వ్యూహం బెడిసింది
అత్యుత్సాహంతో
భంగపడ్డ బీద రవిచంద్ర
చట్టవిరుద్ధంగా రెండు చోట్ల ఓటు కలిగి ఉన్న ఎమ్మెల్సీ
బీద వూహ్యాన్ని తిప్పికొట్టిన వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్‌లు


సాక్షి ప్రతినిధి, నెల్లూరు
: అధికారాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర వేసిన పథకం బెడిసికొట్టింది. కావలి మున్సిపాలిటీపై గుత్తాధిపత్యం చెలాయించేందుకు బీద చేసిన ప్రయత్నాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్‌లు తిప్పికొట్టారు. పెద్దల సభలో సభ్యుడైన బీద రవిచంద్ర నిబంధనలకు విరుద్ధంగా రెండుచోట్ల ఓటుహక్కు పొందారు. అదే వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లకు ఆయుధంగా మారింది. అదేవిధంగా రెండుచోట్ల ఓటుహక్కు పొంది ఉండటంతో  రవిచంద్ర కొత్త వివాదంలో చిక్కుకున్నారు. వివరాల్లోకి వెళితే.. నియోజకవర్గాల పునర్విభజన పుకార్ల నేపథ్యంలో ముందస్తు వ్యూహంతో కావలి మున్సిపాలిటీపై పట్టు బిగించేందుకు ఎమ్మెల్సీ బీద రవిచంద్ర కొత్త వ్యూహానికి తెరతీశారు. పార్టీ ఫిరాయింపు  కేసుతో చైర్మన్ పదవి గాల్లో ఉండటం, వైస్ చైర్మన్ హోదాలో ఇన్‌చార్జ్ చైర్మన్‌గా ఉన్న బీజేపీ నేత భరత్‌కుమార్ అంటీముట్టనట్లు వ్యవహరిస్తుండటాన్ని  రవిచంద్ర అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్సీ హోదాలో కావలి మున్సిపాలిటీ కౌన్సిల్‌లో ఎక్స్‌అఫీషియో మెంబర్‌గా అడుగుపెట్టి చక్రం తిప్పేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈమేరకు సోమవారం నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో ఎక్స్‌అఫీషియో సభ్యునిగా ప్రమాణం స్వీకారం చేయాలని ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. బీద సూచనతో పార్టీ శ్రేణులు ట్రంక్‌రోడ్డు అంతా ఫ్లెక్సీలతో నింపేశారు. కావలిలో సోమవారం ఉదయం నుంచి హడావుడి చేశారు.

తిప్పికొట్టిన వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు : రవిచంద్ర వ్యూహాన్ని అర్థం చేసుకున్న వైఎస్సార్‌సీపీ నేతలు, కౌన్సిలర్‌లు కూడా గుంభనంగా వ్యవహరించారు. ఉదయం నుంచి మౌనంగా ఉండి సమావేశానికి కొద్ది సమయం ముందు సాంకేతిక అంశాలను తెరపైకి తీసుకొచ్చారు. మున్సిపల్ చట్టం 5-2008 ప్రకారం ఎమ్మెల్సీగా నామినేషన్ వేసే ముందునాటికి మున్సిపాలిటీలో ఓటుహక్కు ఉండాలనే నిబంధన ఉంది. ఈ విషయాన్ని వైఎస్సార్‌సీపీ నేత కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి వెలుగులోకి తీసుకురావడంతో అధికారులు ఆలోచనలో పడ్డారు.

రవిచంద్ర చేత ఎక్స్‌అఫీషియో మెంబర్‌గా ప్రమాణ స్వీకారం చేయిస్తే న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుందనే భయంతో రవిచంద్రకు వివరించారు. నిబంధనలకు విరుద్ధంగా వెళితే చిక్కులు తప్పవని సర్దిచెప్పి ఎక్స్‌అఫిషియో సభ్యుని ప్రతిపాదనకు పుల్‌స్టాప్ పెట్టేశారు. దీంతో రవిచంద్ర కూడా ఏం చేయలేక వెనుదిరిగినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే టీడీపీ కౌన్సిలర్లు, అధికారులు అటువంటి ప్రతిపాదనే లేదంటూ కౌన్సిల్ సమావేశాన్ని ఐదు నిమిషాల్లో ముగించేశారు. డామిట్ కథ అడ్డం తిరిగిందంటూ టీడీపీ కార్యకర్తలు ఉస్సూరుమన్నారు.

కొత్త వివాదంలో రవిచంద్ర: కావలి మున్సిపాలిటీలో ఎక్స్‌అఫీషియో మెంబర్‌గా ప్రమాణస్వీకారం చేయబోయి భంగపడ్డ రవిచంద్ర సరికొత్త వివాదంలో ఇరుక్కున్నారు. కావలి మున్సిపాలిటీ పరిధిలో ఓటుహక్కు ఉందా? లేదా? అనే విషయంపై వైఎస్సార్‌సీపీ నేతలు ఆరా తీశారు. రవిచంద్రకు రెండు ఓట్లు ఉన్నట్లు బయటపడింది.
కావలి మున్సిపాలిటీలో ఓటుహక్కు పోగా నెల్లూరు నగరం, సొంతూరైన అల్లూరు మండలం ఇస్కపల్లిలో రెండుచోట్ల ఓటుహక్కు ఉన్నట్లు వైఎస్సార్‌సీపీ నేతలు బయటపెట్టారు. పుట్టిన సంవత్సరాన్ని కూడా తప్పుగా నమోదు చేసినట్లు ఓటరు గుర్తింపుకార్డుల్లో కనిపిస్తోంది. రెం డుచోట్ల ఓటుహక్కు కలిగి ఉండటంపై కూడా వైఎస్సార్‌సీపీ నేతలు న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నారు
Share this article :

0 comments: