నేడు శ్రీకాకుళం జిల్లాకు జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నేడు శ్రీకాకుళం జిల్లాకు జగన్

నేడు శ్రీకాకుళం జిల్లాకు జగన్

Written By news on Saturday, February 13, 2016 | 2/13/2016


నేడు జిల్లాకు జగన్ రాక
పతివాడపాలెం, పైడి భీమవరంలలో వైఎస్ విగ్రహాల ఆవిష్కరణ
వంశధార నిర్వాసితులకు సంఘీభావం
పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి వెల్లడి

 శ్రీకాకుళం అర్బన్ : వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి శనివారం జిల్లాకు రానున్నారు. పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ కుమార్తె వివాహం సందర్భంగా జరిగే కార్యక్రమానికి ఆయన హాజరుకానున్నట్టు పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి తెలిపారు. శనివారం ఉదయం హైదరాబాద్ నుంచి విమానంలో జగన్‌మోహన్‌రెడ్డి 8.15 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు.

అక్కడి నుంచి రోడ్డు మార్గంలో జిల్లాకు వస్తారన్నారు. మార్గమధ్యలో 9.30 గంటలకు పైడిభీమవరం, 10 గంటలకు పతివాడపాలెం ప్రాంతాల్లో వైఎస్ విగ్రహాలను ఆవిష్కరిస్తారని ఆమె పేర్కొన్నారు.  11 గంటలకు ఆమదాలవలస బ్రిడ్జి వద్ద పార్టీ నాయకులంతా జగన్‌మోహన్‌రెడ్డికి ఘనస్వాగతం పలకనున్నారన్నారు. 11.30 గంటలకు మండల కేంద్రమైన సరుబుజ్జిలిలో కూడా జగన్‌కు ఘనస్వాగతం పలకనున్నారన్నారు.

మధ్యాహ్నం 12 గంటలకు హిరమండలం వద్దనున్న వంశధార నిర్వాసితులు వైఎస్ జగన్‌ను కలిసి తమ కష్టాల్ని చెప్పుకుంటారని ఆమె తెలిపారు. అనంతరం కొత్తూరు మండలం మాతలలో కలమట వెంకటరమణ స్వగృహానికి వెళ్లి నూతన వధూవరుల్ని ఆశీర్వదించనున్నారు.
 
ఘనస్వాగతం పలికేందుకు సన్నాహాలు
ఆమదాలవలస: జగన్ పర్యటన విజయవంతం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ైెహ పవర్ కమిటీ సభ్యులు తమ్మినేని సీతారాం పార్టీ శ్రేణులను కోరారు. పట్టణంలోని స్వగృహంలో శుక్రవారం విలేకరల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆమదాలవలస పట్టణ శివార్లలోగల టీ.ఎస్.ఆర్ జూనియర్ కళాశాల ఎదుట పాల కొండ రోడ్ వద్ద ఆయనకు నియోజకవర్గ వైఎస్సార్ కాం గ్రెస్ పార్టీ నాయకులు, మున్సిపాలిటీ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉంటారన్నారు.

నియోజకవర్గంలో గల పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజాసంఘాలువారు పెద్ద ఎత్తున పాల కొండ రోడ్‌లోగల టీ.ఎస్.ఆర్ కళాశాల వద్దకు చేరుకోవాలని  పిలుపునిచ్చారు. సమావేశంలో మున్సిపల్ ప్లోర్ లీడర్  బొడ్డేపల్లి రమేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: