ఆ పార్టీ.. మునిగిపోయే పడవ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఆ పార్టీ.. మునిగిపోయే పడవ

ఆ పార్టీ.. మునిగిపోయే పడవ

Written By news on Saturday, February 20, 2016 | 2/20/2016హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి సీనియర్ నాయకుడని... ఆయన పార్టీలోనే ఉన్నారని ఆ పార్టీ సీనియర్ నేతలు స్పష్టం చేశారు. శనివారం హైదరాబాద్ లో భూమా నాగిరెడ్డి నివాసం వద్ద పార్టీ ఎంపీ వై.వి.సుబ్బారెడ్డితోపాటు ముఖ్య నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి విలేకరులతో మాట్లాడారు.
భూమా నాగిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. టీడీపీ మునిగిపోయే పడవ అని ఆయన ఎద్దేవా చేశారు. రెండేళ్ల కాలంలో ఒక్క ఎమ్మెల్యే అయినా తమ పార్టీని విడిచిపెట్టి వెళ్లారా అని ఈ సందర్భంగా విలేకర్లను సుబ్బారెడ్డి ప్రశ్నించారు. ఇప్పుడు ప్రచారంలో ఉన్న కథనాలన్నీ మీడియా సృష్టించినవే అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కోర్టు కేసు నేపథ్యంలో భూమా నాగిరెడ్డి శుక్రవారం నంద్యాల వెళ్లారని చెప్పారు. ఇప్పటికే మీడియాలో వస్తున్న కథనాలపై ఆయనతో చర్చించామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో టీడీపీ నేతల వేధింపుల అంశం చర్చకు వచ్చిందన్నారు. కుమార్తె పెళ్లి కార్యక్రమాలతో తాను బిజీగా ఉన్నానని... అలాంటి సమయంలో ఇలాంటి వన్నీ ఎందుకు వస్తున్నాయో తెలియట్లేదని భూమా నాగిరెడ్డి తమతో వెల్లడించారని వారు చెప్పారు.
మీడియాలో ప్రసారమైన వార్తలు చూసి తాము భూమాను కలిసేందుకు వచ్చామని ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి, నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి తెలిపారు. విలేకర్లు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా టీడీపీ మైండ్ గేమ్ ఆడుతోందని.... ఏ ఒక్కరూ పార్టీని వీడరని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.
Share this article :

0 comments: