టీడీపీ పల్లకీ కాదు.. పాడే అని త్వరలో తెలుస్తుంది - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » టీడీపీ పల్లకీ కాదు.. పాడే అని త్వరలో తెలుస్తుంది

టీడీపీ పల్లకీ కాదు.. పాడే అని త్వరలో తెలుస్తుంది

Written By news on Friday, February 12, 2016 | 2/12/2016


'టీడీపీ పల్లకీ కాదు.. పాడే అని త్వరలో తెలుస్తుంది'
హైదరాబాద్: ఏం చూసి టీడీపీలోకి చేరాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా అన్నారు. కౌరవులకన్నా ఒక సంఖ్య ఎక్కువే ఉన్న మీరంతా చేస్తుంది ఓ పనికి రాని పాలన అని ఆమె దుయ్యబట్టారు. ప్రజలంతా టీడీపీ ఎమ్మెల్యేలను అసహ్యించుకుంటున్నారని, అలాంటి ఎమ్మెల్యేలున్న పార్టీలోకి తమ పార్టీ ఎమ్మెల్యేలు ఎలా చేరతారని ప్రశ్నించారు.

ఇదంతా ఎల్లో మీడియా చేస్తున్న ప్రచారం అన్నారు. తమపై గోబెల్స్ ప్రచారం చేస్తున్న మీడియా సంస్థలపై చట్టపరంగా ముందుకు వెళతామని, దయచేసి అలాంటి ప్రచారానికి ఏ మీడియా దిగొద్దని అన్నారు. 35 ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబునాయుడికి హైదరాబాద్ ప్రజలు చుక్కులు చూపించారని అన్నారు. ఆయన హైదరాబాద్ నెంబర్ వన్ తానే చేశానని చెప్పుకుంటే నిజంగానే ప్రజలు ఆయనకు ఒక్కటే సీటు మిగిల్చారని చెప్పారు.

భవిష్యత్ లో ఆంధ్రప్రదేశ్ లో కూడా చంద్రబాబుకు రెండు ఎమ్మెల్యే స్థానాలు మాత్రమే మిగులుతాయని అన్నారు. చంద్రబాబునాయుడి పార్టీ ఓ మునిగిపోయే పడవ అని అందులోకి ఎవరు పోయినా మరింత వేగంగా అది మునిగిపోతుందని జోస్యం చెప్పారు. ఆ పార్టీలో ఉన్నవారంతా తామున్నది పల్లకిలో అని భావిస్తున్నారని, అది పాడే అనే విషయం త్వరలోనే తెలుస్తుందని రోజా చెప్పారు. ఇంకా ఆమె చంద్రబాబు నాయుడిని ఏమేం ప్రశ్నించారంటే..
 • ఏం చూసి మా ఎమ్మెల్యేలు మీ పార్టీలోకి వస్తారు?
 • నీ పార్టీలో అసలు ఏం సరుకు ఉంది?
 • మంచి కార్యక్రమాలు చేయలేక మీరంతా చతికిలబడ్డారు
 • అవినీతి, వంచెన, విశ్వాసఘాతుకం, వెన్నుపోటుకు పేరు పెట్టిన నీ పార్టీలోకి ఎవరు వస్తారు.. రాక్షస సంతతి వారు మాత్రమే వస్తారు.
 • జన్మభూమి పేరిట కమిటీలు వేసి ప్రజాప్రతినిధులను పక్కన పెట్టి ఫించన్లు రద్దు చేస్తున్నారు. అక్రమాలకు పాల్పడుతున్నారు.
 • ఎమ్మెల్యేలను లాక్కోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు.
 • నిలదీస్తే సస్పెన్షన్ వేశారు, లేదంటే కేసులు పెట్టారు, ప్రలోభాలు పెట్టారు.. కానీ ఒక్కరైనా నీ పార్టీలోకి వచ్చారా?
 • ఇప్పుడున్న తమ ఎమ్మెల్యేలంతా వైఎస్ జగన్ వెనుక ఉంది అధికారం చూసి కాదు కష్టాలు చూసి.
 • ప్రజలకు అండగా వైఎస్‌ జగన్ ఉన్నారు. రాజన్న పాలన తీసుకురావాలనుకుంటున్నారు.
 • చంద్రబాబు అస్తమించే సూర్యుడు.. వైఎస్ జగన్ ఉదయించే సూర్యుడు
 • చంద్రబాబు పాత టైప్ రైటర్.. వైఎస్ జగన్ హైస్పీడ్ ఆపిల్ కంప్యూటర్ అంటూ ఆమె చంద్రబాబుపై ధ్వజమెత్తారు.
Share this article :

0 comments: