టీడీపీ ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారు: వైఎస్ జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » టీడీపీ ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారు: వైఎస్ జగన్

టీడీపీ ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారు: వైఎస్ జగన్

Written By news on Wednesday, February 17, 2016 | 2/17/2016


టీడీపీ ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారు: వైఎస్ జగన్
హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  ప్రభుత్వానికి ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు  వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి  హెచ్చరికలు జారీ చేశారు.  ఆంధ్రప్రదేశ్ లో తమ ఎమ్మెల్యేలు 67 మంది వున్నారని....తమ పార్టీలోకి టీడీపీ ఎమ్మెల్యేలు వస్తారని..ప్రభుత్వాన్ని పడగొట్టే సంఖ్య వచ్చినప్పుడు వారి పేర్లు చెబుతానన్నారు. వారి పేర్లు చెప్పిన గంటలోనే చంద్రబాబు ప్రభుత్వం పడిపోతుందని వైఎస్‌ జగన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన తరువాత వైఎస్‌ జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

'నేను మాటలు చెప్పడం ఎందుకు? మీరే చూస్తారుగా. తన కేబినెట్ మీటింగ్ లో మంత్రులకు చెబుతారు. కేటీఆర్, హరీశ్ ను చూసి బుద్ధి తెచ్చుకోండి. ఎమ్మెల్యేలను ఎందుకు కొనడం లేదని కేబినెట్ లో మంత్రులకు చెప్పడం దారుణం. చంద్రబాబుకు సవాల్ విసురుతున్నాం. ఇవన్నీ ఎందుకు ప్రభుత్వాన్ని రద్దు చేసి ప్రజల్లోకి రాగలరా? నువ్వే సీఎం అయితే ఏ సమస్య లేదు. నువ్వు గెలుస్తావో, మేం గెలుస్తామో ప్రజలు తీర్పు చెబుతారు. చంద్రబాబు నాయుడు సంపాదించిన బ్లాక్ మనీ ఎక్కువ ఉంది. ఆయన ఏమైనా చేయగలడు. పై నున్న దేవుడు, ప్రజలు మొట్టికాయలు వేస్తారు.' అని వైఎస్ జగన్ అన్నారు.

చంద్రబాబుకు ఓ చెడ్డ అలవాటు ఉంది. ఆయనకు మీడియాలో కొద్దో గొప్పో సపోర్టు ఉంది. దాని ద్వారా తప్పుడు ప్రచారాలు చేయడం ఆయనకు అలవాటు అయిన పని. వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే టీడీపీలో చేరుతున్నారంటూ పేపర్లలో రాస్తారు. టీవీల్లో చూపిస్తారు. ఆశ్చర్యం ఏమిటంటే వాళ్లు రాయడం... మా ఎమ్మెల్యేలు జిల్లాల వైజ్ గా ప్రెస్ మీట్ లు, మీడియా సమావేశాలు పెట్టి ఎడాపెడా తిట్టడం..అలా తిడుతున్నా అలా అలా దులుపుకుని... నాలుగు రోజులవరకూ ఆగి మళ్లీ ఐదోరోజు మొదలు. అసలు ప్రజల్లో  చంద్రబాబు నాయుడు గురించి ఎంక్వైరీ చేస్తే తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు.  అసలు బుద్ధి ఉన్నవాళ్లు ఎవరూ టీడీపీలోకి వెళ్లరు. కానీ చంద్రబాబుకి అవన్నీ తెలిసినా దులుపుకుపోవడం అలవాటే.' అని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు.
Share this article :

0 comments: