
విజయవాడ: మాస్టర్ ప్లాన్ వల్ల రైతుల జీవితాలు నాశనం అవుతాయని మొదట నుంచీ చెబుతున్నా పట్టించుకోలేదని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆయనిక్కడ శనివారం మాట్లాడుతూ రాజధాని పేరుతో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆయన అవేదన వ్యక్తం చేశారు. కాగా రైతుల్లో ఎంత వ్యతిరేకత ఉందో టీడీపీ నేతలకు ఇప్పుడు అర్థమైందన్నారు. కాగా సీఆర్ డీఏ రాజధాని మాస్టర్ ప్లాన్ పై టీడీపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
0 comments:
Post a Comment