అప్పుడు కేసులు.. ఇప్పుడు మంచివాళ్లా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అప్పుడు కేసులు.. ఇప్పుడు మంచివాళ్లా?

అప్పుడు కేసులు.. ఇప్పుడు మంచివాళ్లా?

Written By news on Tuesday, February 23, 2016 | 2/23/2016


అప్పుడు కేసులు.. ఇప్పుడు మంచివాళ్లా?
గుంటూరు :
గత అసెంబ్లీ ఎన్నికల్లో భూమా నాగిరెడ్డి గెలిచిన తర్వాత ఆయనపై ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసులు పెట్టించిన టీడీపీ ప్రభుత్వానికి.. ఇప్పుడు తమ పార్టీలో చేరగానే మంచివాడు అయిపోయారా అని వైఎస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ప్రశ్నించారు. నాగిరెడ్డికి మంత్రిపదవి కూడా ఇస్తారని చెబుతున్నారని.. అలా ఇవ్వాలంటే ఆయనతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించి మళ్లీ సైకిల్ గుర్తు మీద గెలిపించుకుని ఇవ్వాలని చెప్పారు. కానీ అలా కాకుండా ఆయనతో నామమాత్రంగా రాజీనామా లేఖ రాయించి, స్పీకర్ చెవిలో మాత్రం దాన్ని ఆమోదించవద్దని చెప్పి మంత్రి పదవి ఇస్తారా అన్న అనుమానం వ్యక్తం చేశారు.

అదే జరిగితే.. వైఎస్ఆర్‌సీపీ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే సంవత్సరాల తరబడి మంత్రిగా పనిచేస్తారని, ఇది చాలా అనైతికమైన, చట్ట వ్యతిరేక చర్య అని అంబటి రాంబాబు అన్నారు. ఇలాంటి అనైతిక చర్యలకు సీఎం పాల్పడుతుంటే ఎలాగని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు గానీ, ఎమ్మెల్సీలు గానీ.. వైఎస్ఆర్‌సీపీ తరఫున సంక్రమించిన పదవులకు రాజీనామా చేసి అప్పుడు ఆ పార్టీలోకి వెళ్లాలని, అప్పుడే ప్రజలు శభాష్ అంటారని, లేకపోతే ఛీకొడతారని చెప్పారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లోకి వెళ్లినప్పుడు తానేం మాట్లాడారో అవే ఇక్కడ కూడా వర్తిస్తాయన్న విషయాన్ని చంద్రబాబు గుర్తుపెట్టుకోవాలని సూచించారు.
Share this article :

0 comments: