ఎమ్మెల్యే ఆదిమూలపు సురేశ్
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: తాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డితోనే ఉంటానని, పార్టీ మారుతున్నట్లు వస్తున్న కథనాల్లో వాస్తవం లేదని సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేశ్ స్పష్టం చేశారు.
మంగళవారం రాత్రి ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ తాను వైఎస్సార్‌సీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచానని, ఆ పార్టీ ఎమ్మెల్యేగానే కొనసాగుతానని చెప్పారు. కొన్ని చానళ్లలో అసత్య ప్రచారం జరుగుతోందని, తాను పార్టీ మారడం లేదని వెల్లడించారు. జగన్ నాయకత్వంలోనే పనిచేస్తానని ఉద్ఘాటించారు.

0 comments:
Post a Comment