వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేల వద్ద
‘ఆకర్ష్’ ఆటలు సాగవు
ఎమ్మెల్యే మణిగాంధీ
జిల్లా అంతటా అంబేడ్కర విగ్రహాలకు క్షీరాభిషేకాలు
కర్నూలు (ఓల్డ్‌సిటీ): ఎస్సీలను అవమానపరిచే విధంగా మాట్లాడి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దళిత ద్రోహిగా నిలిచారని ఎమ్మెల్యే మణిగాంధీ ఆరోపించారు. ఎన్నికల మేనిఫెస్టోలో దళితులకిచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా వారిని మోసం చేస్తున్నారని విమర్శించారు. శనివారం స్థానిక పాతబస్టాండులోని అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం అన్ని విధాలా విఫలమైందన్నారు. వైఫల్యాలు దాచి పెట్టుకునేందుకే కొత్త డ్రామాలు ఆడుతున్నారన్నారు.
వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారని అసత్య ప్రచారం చేస్తూ చంద్రబాబు మైండ్‌గేమ్ ఆడుతున్నారని, రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారని విమర్శించారు. వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేల వద్ద ‘ఆకర్ష్’ ఆటలు సాగబోవన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ 2019లో తప్పకుండా అధికారంలోకి వస్తుందని, కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డేనని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర నాయకులు తెర్నేకల్ సురేందర్‌రెడ్డి, రహిమాన్, మద్దయ్య, సలీం, జిల్లా నాయకులు పులిజాకోబ్, షరీఫ్, పి.రాజావిష్ణువర్దన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
అంబేడ్కర్ విగ్రహాలకు క్షీరాభిషేకాలు..
ఆత్మకూరు పాతబస్టాండ్‌లోని అంబేద్కర్ విగ్రహానికి వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు క్షీరాభిషేకం చేసి నిరసన వ్యక్తం చేశారు. పార్టీ ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు బాలన్న, పట్టణ ప్రధాన కార్యదర్శి రామూర్తి పాల్గొనానరు. ఎస్సీలుగా పుట్టాలని ఎవరూ కోరుకోరని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దళిత సామాజిక వర్గాన్ని కించపర్చేలా మాట్లాడటం ఆయన స్థాయికి తగదని వైఎస్సార్సీపీ ఎమ్మిగనూరు నియోజకవర్గ కో-ఆర్డినేటర్ ఎర్రకోట జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. మునిసిపల్ మాజీ చైర్మన్ బుట్టా రంగయ్య, వైఎస్సార్సీపీ నాయకులు రాజారత్నం పాల్గొన్నారు.
వెల్దుర్తిలో అంబేడ్కర్ విగ్రహానికి వైస్సార్సీపీ పత్తికొండ నియోజకవర్గ ఇన్‌చార్జ్ చెరుకుపాడు క్షీరాభిషేకం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దళితులకు బహిరంగ క్షమాపణలు చెప్పాల న్నారు.పాత కల్లూరులోని ఇందిరమ్మ కట్టపై ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహానికి వైఎస్‌ఆర్‌సీపీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఫిరోజ్, ఎస్సీ సెల్ సభ్యుడు అల్లిపీర క్షీరాభిషేకం చేశారు.

0 comments:
Post a Comment