
రాష్ట్రపతి ప్రణబ్ తో భేటీ అనంతరం వైఎస్ జగన్ మంగళవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. ' ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అంశంపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశాం. మా విజ్ఞప్తులకు రాష్ట్రపతి సానుకూలంగా స్పందించారు. చంద్రబాబు ఏనాడు ప్రత్యేక హోదా గురించి మాట్లాడరు. నాడు అధికార, విపక్షాలన్నీ కలిసి ప్రత్యేక హోదాపై హామీ ఇచ్చాయి. ఇప్పుడు ఆ హామీ గురించి పట్టించుకునేవారు లేరు.
ప్రత్యేక హోదా అంశాన్ని ఒకసారి గుర్తు చేయడం కోసమే రాష్ట్రపతిని కలిశాం. ఇదే అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అపాయింట్ మెంట్ కోరాం. జాట్ ల సమస్య కారణంగా అపాయింట్ మెంట్ ఇవ్వలేకపోయారు'. అన్నారు. వైఎస్ జగన్ తో పాటు పార్టీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి, పెదిరెడ్డి మిథున్‌రెడ్డి, వైఎస్ అవినాశ్‌రెడ్డి, వరప్రసాద్ లు రాష్ట్రపతిని కలిసినవారిలో ఉన్నారు.
0 comments:
Post a Comment