మంత్రి పదవి పోతుందన్న భయంతోనే .. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మంత్రి పదవి పోతుందన్న భయంతోనే ..

మంత్రి పదవి పోతుందన్న భయంతోనే ..

Written By news on Saturday, February 27, 2016 | 2/27/2016


మంత్రి పదవి పోతుందన్న భయంతోనే విమర్శలు
మంత్రి పల్లెపై పుట్టపర్తి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ       
సమస్వయకర్త దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి ధ్వజం


నల్లమాడ: మంత్రి పల్లె రఘునాథరెడ్డి పదవి పోతుందన్న భయంతోనే వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై విమర్శలు చేస్తున్నారని పుట్టపర్తి నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం మండలంలోని నల్లసింగయ్యగారిపల్లిలోని ఆయన నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.  ఆయన మాట్లాడుతూ మంత్రి పల్లె పుట్టపర్తి నియోజకవర్గ అభివృ ద్ధికి  పాటు పడాలే తప్ప జగన్‌పై విమర్శలు చేయడం తగదన్నారు.  చంద్రబాబు వద్ద మెప్పు పొంది మంత్రి పదవిని కాపాడు కోవడానికే పల్లె నాటకం ఆడుతున్నారన్నారు.

పల్లె తక్షణమే పదవికి రాజీనామా చేసి ధైర్యం ఉంటే పుట్టపర్తి నియోజకవర్గంలో తన మీద పోటీ చేసి గెలుపొందాలని ఆయన సవాల్ విసిరారు.  జగన్ కాలిగోటికి కూడా పల్లె దీటు రాడన్నారు.  టీడీపీలోకి చేరిన భూమానాగిరెడ్డి కుటుంబానికి మంత్రి పదవి దక్కుతుందన్న భయం పల్లెకు పట్టుకుందన్నారు. నియోజకవర్గంలో   పగటి పూట తిరగడానికి కూడా మంత్రి భయపడుతున్నారన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ఉంట్ల బ్రహ్మానందరెడ్డి, జిల్లా అధికారప్రతినిధి డీఎస్ కేశవరెడ్డి, సింగల్‌విండో డెరైక్టర్ కుళ్లాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: