Home »
» ప్రలోభాలకు లొంగను, వైఎస్ఆర్ సీపీలోనే
ప్రలోభాలకు లొంగను, వైఎస్ఆర్ సీపీలోనే
శ్రీకాకుళం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో టీడీపీ మైండ్ గేమ్ ఆడుతోందని రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు మండిపడ్డారు. ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ తమ ఎమ్మెల్యేలు టీడీపీకి వస్తున్నారంటూ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. తాను వైఎస్ఆర్ సీపీలోనే కొనసాగుతానని, ప్రలోభాలకు లొంగనని ఎమ్మెల్యే కంబాల జోగులు స్పష్టం చేశారు.మరోవైపు చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ సీపీ నేత నారాయణస్వామి మాట్లాడుతూ వెన్నుపోటుదారులే పార్టీని వదిలివెళ్లారన్నారు. పార్టీని వదిలివెళ్లిన వారికి రాజకీయ భవిష్యత్తు లేదని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీ మారినవారు నమ్మకద్రోహులుగా చరిత్రలో నిలిచిపోతారన్నారు. ఎన్నికలొస్తే బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని నారాయణస్వామి వ్యాఖ్యానించారు.
0 comments:
Post a Comment