టీడీపీ టికెట్‌పై గెలవగలరా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » టీడీపీ టికెట్‌పై గెలవగలరా?

టీడీపీ టికెట్‌పై గెలవగలరా?

Written By news on Wednesday, February 24, 2016 | 2/24/2016


టీడీపీ టికెట్‌పై గెలవగలరా?
♦ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు వైఎస్సార్‌సీపీ సవాల్
♦ చంద్రబాబుది రాజకీయ వ్యభిచారం

 సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్‌సీపీ నుంచి అధికారపక్షంలోకి ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్యేలు దమ్ముంటే తమ పదవులకు రాజీనామా చేసి టీడీపీ టికెట్‌పై పోటీ చేసి గెలవాలని ప్రతిపక్ష ఎమ్మెల్యేలు సవాలు విసిరారు. వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్షం ఉపనేత జ్యోతుల నెహ్రూ, ఎమ్మెల్యేలు కొరుముట్ల శ్రీనివాసులు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ తమ ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ వ్యభిచారం చేస్తున్నారని మండిపడ్డారు.  జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ పార్టీ మారిన ఈ నలుగురు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ నుంచి అభ్యర్థిని ఎవరు నిలబెట్టాలనేది కూడా వారే నిర్ణయించుకోవచ్చని ఆ ‘ఛాయిస్’ను కూడా తాము వారికే ఇస్తున్నామన్నారు. ఎమ్మెల్యేలు అధికారపక్షంలోకి వెళ్లినంత మాత్రాన ప్రజల్లో మార్పు లేదని ప్రజలంతా వైఎస్సార్‌సీపీ పక్షానే ఉన్నారని, ఎన్నికలు జరిగితే జగన్‌కు ఎపుడెపుడు ఓటేయాలా అని ఎదురు చూస్తున్నారన్నారు.

 ఏం చూసి వెళ్లారు?: నలుగురు ఎమ్మెల్యేలు ఏం చూసి చంద్రబాబు పార్టీలోకి వెళ్లారు? చంద్రబాబు పాలన ప్రజాహితంగా సాగుతోందని వెళ్లారా? ఎన్నికలపుడు ఇచ్చిన రైతుల, డ్వాక్రా మహిళల రుణ మాఫీని అమలు చేశారని వెళ్లారా? నిరుద్యోగ సమస్య, కాపుల సమస్య పరిష్కరిస్తున్నారని వెళ్లారా? అని సూటిగా ప్రశ్నించారు. కేవలం దొంగ కేసులు, అవినీతి సూట్‌కేసుల కోసమేననేది స్పష్టమవుతోందన్నారు. శ్రీనివాసులు మాట్లాడుతూ తాను పార్టీలో చేర్చుకున్న ఎమ్మెల్యేల చేత చంద్రబాబు రాజీనామా చేయించి నైతిక విలువలకు కట్టుబడి ఉండాలన్నారు.   పిన్నెల్లి మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా గద్దెనెక్కినపుడు చేసిన తొలి ఐదు సంతకాలు ఎందుకు అమలు చేయలేక పోతున్నారో చంద్రబాబు అవలోకించుకోవాలన్నారు.
Share this article :

0 comments: