వెన్నుపోట్లు పొడవడమే క్యారెక్టరా..? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వెన్నుపోట్లు పొడవడమే క్యారెక్టరా..?

వెన్నుపోట్లు పొడవడమే క్యారెక్టరా..?

Written By news on Saturday, February 27, 2016 | 2/27/2016


వెన్నుపోట్లు పొడవడమే క్యారెక్టరా..?
చంద్రబాబును ప్రశ్నించిన ఎమ్మెల్యే పీఆర్కే

మాచర్ల : క్యారెక్టర్ కలిగి ఉండడమంటే సొంత మామకు వెన్నుపోటు పొడిచి దొడ్డిదారిలో అధికారంలోకి రావడమేనా అని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తాను క్యారెక్టర్ కలిగిన వ్యక్తినని సీఎం చంద్రబాబు చెప్పుకోవడంపై తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్‌పార్టీలో ఉన్న చంద్రబాబు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి మామ ఎన్టీఆర్ వద్ద చేరి,చివరకు ఆయనకే వెన్నుపోటు పొడిచారన్నారు. తన వెంట వచ్చిన హరికృష్ణ, దగ్గుపాటి వెంకటేశ్వరరావులను ఆరు నెలల్లో వదిలించుకొని వారికి సైతం తన వెన్నుపోటు ఎలా ఉంటుందో చూపించారన్నారు. వైస్రాయి హోటల్‌లో క్యాంప్ నిర్వహించి ఎమ్మెల్యేలను బంధించి అధికారం చేపట్టిన వ్యక్తి, ఇప్పుడు  ప్రజలకు ఏమీ తెలియదన్నట్లు తనకు తాను సచ్చీలుడుగా చెప్పుకోవడం విడ్డూరమన్నారు. తెలంగాణలో ఓటుకు నోటు కేసులో ఇరుక్కోవడం, రాష్ట్రంలో అవినీతి అక్రమ చర్యలకు తెరతీయడం, తాజాగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడమే క్యారెక్టర్ కలిగి ఉండడమా అంటూ ప్రశ్నించారు.

మొదటి నుంచి ఇప్పటి వరకు ఆయా వర్గాలను మోసగించి, కులమతాలను చీల్చి  నీచ రాజకీయాలు నడుపుతున్న చంద్రబాబుకు క్యారెక్టర్ గురించి చెప్పుకునే అర్హత లేదన్నారు. క్యారెక్టర్ అంటే వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌ను చూసి నేర్చుకోవాలన్నారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఫ్యాన్ గుర్తుపై గెలిపించిన చరిత్ర జగన్‌దేనన్నారు. నీకు  క్యారెక్టర్ ఉంటే వైఎస్సార్‌సీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి సైకిల్ గుర్తుపై పోటీ చేయించి సత్తా చాటాలని, అప్పుడు క్యారెక్టర్ గురించి మాట్లాడాలని ఎమ్మెల్యే పీఆర్కే సూచించారు.
Share this article :

0 comments: