రాజ్‌భవన్ వద్ద వైఎస్ జగన్ అన్నమాటలివే - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాజ్‌భవన్ వద్ద వైఎస్ జగన్ అన్నమాటలివే

రాజ్‌భవన్ వద్ద వైఎస్ జగన్ అన్నమాటలివే

Written By news on Tuesday, February 23, 2016 | 2/23/2016

ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, తుని రైలు దహనం ఉదంతంలో వైఎస్సార్‌సీపీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన నిరాధారామైన ఆరోపణలపై ఫిర్యాదు చేయడానికి రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎస్ నరసింహన్ వద్దకు ఈ నెల 17వ తేదీన వెళ్లి వినతి పత్రం సమర్పించారు. ఆ తరువాత అదే రోజు అక్కడే మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వాన్ని పడగొడతానని వైఎస్ జగన్ వ్యాఖ్యలు చేసినట్లుగా పదే పదే ఓ వర్గం మీడియా బద్నాం చేయడంతోపాటు అధికారపక్షం అదే పనిగా ఇవే వక్రీకరణలను ప్రస్తావిస్తూ ఉన్న నేపథ్యంలో అసలు ఆ రోజు జగన్ ఏం మాట్లాడారు అనే వీడియో దృశ్యాలను మంగళవారం విలేకరుల సమావేశంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు ప్రదర్శించారు.
వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్షం ఉపనేత జ్యోతుల నెహ్రూ, ఎమ్మెల్యేలు కొరుముట్ల శ్రీనివాసులు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు ఏదో ఒక వంక చెబుతూ ఆ రోజు జగన్ అలా అన్నందు వల్లనే తాను వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకుంటున్నానంటున్నారన్నారు. అందుకే ఈ వాస్తవ దృశ్యాలు చూసి ప్రజలు, మీడియానే నిర్థారించుకోవాలని వారు కోరారు. ఫిబ్రవరి 17వ తేదీన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజ్‌భవన్ వద్ద మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఏమన్నారంటే... (ఆ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి)

మీడియా ప్రతినిధి ప్రశ్న : చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి వెళ్లి పోతున్నారని అంటున్నారు.
జగన్ : (నవ్వుతూ) చంద్రబాబునాయుడు గారిని గట్టిగా అడగండమ్మా...అసలు టీడీపీ నుంచి వైసీపీలోకి ఎంత మంది రాబోతున్నారో అడగండి ఒక్కసారి,

మీడియా ప్రతినిధి ప్రశ్న : ఎవరెవరు వస్తున్నారు...?
జగన్ : నేను మాటలు చెప్పడం ఎందుకు లేమ్మా... మీరే చూస్తారు కదా!

మీడియా ప్రతినిధి ప్రశ్న : టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మీ పార్టీలోకి వస్తాడా?
జగన్ : ఇప్పుడవన్నీ చెప్పడం కరెక్ట్‌గా ఉండదు (సరికాదు), చంద్రబాబు గారికి ఒక చెడ్డ అలవాటు ఉంది. ఆ అలవాటు ఏంటంటే...చంద్రబాబు గారికి మీడియాలో కొద్దో గొప్పో సపోర్టు ఉంది. కొంత మంది...వాళ్ల ద్వారా చంద్రబాబు తప్పుడు ప్రచారం చేయడం ఆయనకు చాలా అలవాటైన పని. అయితే నాకొక్కటి, వీళ్లంతా రాస్తారు... టీవీల్లో చూపిస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుంచి ఇంత మంది ఎమ్మెల్యేలు వెళ్లి పోతున్నారు... అంత మంది వెళ్లి పోతున్నారు అని .... ఆ జిల్లా నుంచి... ఈ జిల్లా నుంచి వెళ్లి పోతున్నారని. ఆశ్చర్యం ఏంటంటే వాళ్లు రాయడం, మా వాళ్లు విలేకరుల సమావేశాలు పెట్టి చంద్రబాబును ఎడాపెడా తిట్టడం. నీ బోటే సింకింగ్ బోటు ... నీ పడవే మునిగిపోయే బోటు.. ప్రజల్లోకి ఒక్కసారి వెళ్లి చంద్రబాబు గారిని ఏమంటున్నారని ఎంక్వయిరీ చేస్తే ప్రజలు చంద్రబాబునాయుడును తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. 
ఎన్నికలపుడు ఏం చెప్పావు...ఇపుడేం చేస్తున్నావు అని చెప్పి ప్రజలు చంద్రబాబును తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. నిజంగా బుద్ధి ఉన్నవాడెవ్వడూ చంద్రబాబునాయుడు పార్టీలోకి పోడని తెలుసు కానీ ఆయన మాత్రం, మా ఎమ్మెల్యేలు రోజూ జిల్లాల వారీగా విలేకరుల సమావేశాలు పెట్టి తిడుతూ ఉన్నా కూడా...అలా దులుపుకుంటాడు, మళ్లీ అదే ప్రచారం రెండో రోజు, మూడో రోజు, నాలుగో రోజు ఆగుతారు, మళ్లీ స్టార్ట్ (మొదలు) చేస్తారు.
ప్రజలకు కూడా విసుగొచ్చింది. నిజంగా... నేను చంద్రబాబు నాయుడుకు సవాలు విసురుతున్నాను. నువ్వు మంత్రివర్గ సమావేశం పెట్టి ఆ సమావేశంలో మంత్రులకు చెబుతావు. కేటీఆర్‌ను చూసి బుద్ధి తెచ్చుకోండి... హరీష్‌రావును చూపి బుద్ధి తెచ్చుకోండి వాళ్లెంతగా ఎమ్మెల్యేలను లాగుతా ఉన్నారో చూడండి. మీరేం చేస్తున్నారో చూడండి అంటావు. అసలు ఎమ్మెల్యేలను డబ్బిచ్చి కొనడానికి నువ్వు నీ మంత్రులతో క్యాబినెట్‌లో ఎందుకు కొనడం లేదు అని చెప్పి ఎందుకు కొని నా దగ్గరకు తీసుకురావడం లేదు అని చెప్పి, నిస్సిగ్గుగా ఒక ముఖ్యమంత్రి చెబుతూ ఉన్నాడని అంటే...ఆశ్చర్యం అనిపించింది. చంద్రబాబుకు నిజంగానే నేను సవాలు విసురుతూ ఉన్నాను. ఇవన్నీ
ఎందుకు? ఇవన్నీ ఎందుకు ? రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేసేయ్...ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను. ప్రజల్లోకి పోదాం. నువ్వు మళ్లీ గెలిస్తే సమస్యే లేదు కదా...నువ్వు గెలుస్తావో... మేం గెలుస్తామో...ప్రజలే తీర్పు నిస్తారు.

మీ.ప్ర : ఆర్థిక భారం పడుతుంది కదా?
జగన్ : చంద్రబాబు సంపాదించిన బ్లాక్‌మనీ (నల్లధనం) ఎక్కువగా ఉంది. కరప్షన్(అవినీతి) మనీ ఎక్కువగా ఉంది. కాబట్టి చంద్రబాబునాయుడు ఏదైనా చేయడానికి సిద్ధపడతాడు. కానీ దేవుడున్నాడు. దేవుడు మొట్టికాయలు వేస్తాడు. ప్రజలు మొట్టికాయలు వేస్తారు.

మీ.ప్ర : స్పీకర్ మీద అవిశ్వాసం పెడతారా?
జగన్ : అసెంబ్లీ స్పీకర్ మీద కచ్చితంగా అవిశ్వాస తీర్మానం పెడతాం.

మీ. ప్ర : ప్రభుత్వం మీద ఏమైనా అవిశ్వాసం పెడతారా?
జగన్ : మా నెంబర్ (మాకున్న బలం) 67 మంది శాసనసభ్యులనే సంగతి అందరికీ తెలుసు తల్లీ... ఎలా పెడతాం.

మీ.ప్ర : టీడీపీ ఎమ్మెల్యేలు మీతో టచ్‌లో ఉన్నారని చెప్పారు కదా?
జగన్ : టీడీపీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారన్నాను తప్పితే, 21 మంది... ప్రభుత్వాన్ని టాపుల్ చేసేంత (పడగొట్టేంత) మంది ఉన్నారని నేను చెప్పలేదు. ఆ నెంబర్ (బలం)కు వచ్చినపుడు కచ్చితంగా చెబుతా... నీకు పిలిచి చెబుతా... చెప్పిన గంటలోపు ప్రభుత్వం పడిపోతుంది.
Share this article :

0 comments: