బెడిసికొట్టిన టీడీపీ కుట్ర - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బెడిసికొట్టిన టీడీపీ కుట్ర

బెడిసికొట్టిన టీడీపీ కుట్ర

Written By news on Thursday, February 11, 2016 | 2/11/2016


బెడిసికొట్టిన టీడీపీ కుట్ర
► పార్టీ మారుతున్నామన్న  దుష్ర్పచారాన్ని తిప్పికొట్టిన  వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు
► వైఎస్సార్‌సీపీలోనే కొనసాగుతామని స్పష్టీకరణ
 వై.ఎస్.జగన్‌ను సీఏం చేయడమే లక్ష్యమని ఉద్ఘాటన

 
విశాఖపట్నం : టీడీపీ రాజకీయ కుయుక్తులపై జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ మండిపడింది. వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరబోతున్నారన్న  దుష్ర్పచారాన్ని తిప్పికొట్టింది. ఈమేరకు పార్టీ ఎమ్మెల్యేలు బూడి ముత్యాలనాయుడు, గిడ్డి ఈశ్వరి సీఎం చంద్రబాబు దిగజారుడు రాజకీయాలపై మండిపడ్డారు. తెలంగాణాలో టీడీపీ ఎమ్మెల్యేలు  టీఆర్‌ఎస్‌లో చేరుతున్న విషయం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే తమ అనుకూల మీడియా ద్వారా చంద్రబాబు దుష్ర్పచారం చేయిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రాణాలు ఉన్నంతవరకు వైఎస్సార్ కాంగ్రెస్‌లోనే కొనసాగుతామని స్పష్టం చేశారు. చంద్రబాబు ప్రజావ్యతిరేక విధానాలపై తమ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో పోరాడతామన్నారు. వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం చేయడం ద్వారా రాష్ట్రంలో దివంగత వై.ఎస్. సంక్షేమ పాలన తీసుకురావడమే తమ లక్ష్యమన్నారు.

బెడిసికొట్టిన చంద్రబాబు కుట్ర
వైఎస్సార్ కాంగ్రెస్‌ను దొంగ  దెబ్బతీయడానికి సీఎం చంద్రబాబు వేసిన కుట్ర బెడిసికొట్టింది. ఎన్నికల హామీలను నెరవేర్చలేక చేతులెత్తేసిన సీఎం చంద్రబాబు దిగజారుడు రాజకీయాలపై జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. ప్రజా వ్యతిరేకత కూడగట్టుకున్న టీడీపీ ప్రభుత్వం ప్రధాన ప్రతిపక్షంపై దుష్ర్పచారానికి తెగబడిందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు దుయ్యబట్టారు. తెలంగాణాలో టీడీపీ ఎమ్మెల్యేలు 10మంది టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు.

ఆ రాష్ట్రంలో టీడీపీ కనుమరుగవుతోంది. ఈ విషయం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే చంద్రబాబు వైఎస్సార్ కాంగ్రెస్‌పై దుష్ర్పచారానికి తెగబడ్డారని తేటతెల్లమైంది. అందుకే చంద్రబాబు తమ అనుకూల మీడియా ద్వారా వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ మారబోతున్నారని ప్రచారానికి తెరతీశారు. కానీ దీన్ని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, శ్రేణులు సమష్టిగా తిప్పికొట్టడంతో టీడీపీ బిత్తరపోయింది.

ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మాదే గెలుపు
రెండేళ్లలోనే చంద్రబాబు పాలనతో ప్రజలు విసిగిపోయారని వైఎస్సార్‌కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైఎస్సార్ కాంగ్రెస్‌ను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని చెబుతూనే సీఎం చంద్రబాబు గోదావరి పురష్కరాలకు 1200 కోట్లు, రాజధాని శంకుస్థాపనకు 400 కోట్లు, విదేశీ పర్యటనలకు వందల కోట్లు ఏలా ఖర్చు చేస్తున్నారని ప్రశ్నించారు.

ప్రజలు సంక్షేమం, ఉద్యోగుల జీతాలు లేవంటూ ప్రచార ఆర్భాటం కోసం ఇంత సొమ్ము ఎలా ఖర్చు చేస్తున్నారని దుమ్మెత్తి పోశారు. అభివృద్ధికంటే దోచుకోవడానికి అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నారని, తన ప్రభుత్వ సొమ్మును అనమాయులకు దోచుపెడుతున్నారని ఆరోపించారు.

వై.ఎస్.జగన్ వెన్నంటేనని స్పష్టీకరణ
పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిపై పార్టీ ఎమ్మెల్యేలు సంపూర్ణ విశ్వాసం ప్రకటించారు. కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు వైఎస్సార్‌కాంగ్రెస్‌లోనే కొనసాగుతామని కుండబద్ధలు కొట్టారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై  జగన్ వెన్నంటి నిలుస్తామన్నారు. జగన్‌ను సీఎం చేయడం ద్వారా దివంగత వై.ఎస్. సంక్షేమ పాలనను ప్రజలకు అందించడమే తమ లక్ష్యమన్నారు.
 
జగన్‌ను సీఎం చేయడమే లక్ష్యం  
‘సీఎం చంద్రబాబుకు మతిభ్రమించి వైఎస్సార్‌కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై దుష్ర్పచారం చేస్తున్నారు. ప్రాణాలు ఉన్నంతవరకు వైఎస్సార్ కాంగ్రెస్‌లోనే కొనసాగుతా. చంద్రబాబు రెండేళ్లలోనే ప్రజావిశ్వాసం కోల్పోయారు. వై.ఎస్.జగన్ మాత్రమే నిస్వార్థంగా ప్రజల వెన్నంటి ఉంటున్నారు. ఇప్పటికే పలు మార్లు అధికార టీడీపీ  కుయుక్తులు పన్నినప్పటికీ వైఎస్సార్‌సీపీకి చెందిన ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ఆ పార్టీవైపు కన్నెత్తి చూడలేదు.  ఎన్నికలు ఎప్పుడొచ్చిన అధికార టీడీపీని భూస్థాపితం చేసి వైఎస్సార్‌సీపీని గెలుపించేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారు’
 - ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు, ఎమ్మెల్యే, మాడుగుల
 
టీడీపీలో చేరాల్సిన అగత్యం లేదు
‘ఎన్నికల హామీలను నెరవేర్చకుండా ప్రజావ్యతిరేకత మూటగట్టుకున్న టీడీపీలో చేరాల్సిన అగత్యం  వైఎస్సార్ కాంగ్రెస్  ఎమ్మెల్యేలకు లేదు. పార్టీ ఎమ్మెల్యేలతోపాటు రాష్ట్ర ప్రజలు అంతా వై.ఎస్.జగన్ వెన్నంటి ఉన్నారు.  చంద్రబాబు వైఖరి వల్ల తెలంగాణలో టీడీపీ నేతలందరూ అధికార టీఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నారు. ఇది మింగుడుపడక ఆంధ్రాలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు చేరుతున్నట్లు దుష్ర్పచారం చేస్తూ  టీడీపీ కుట్ర పన్నుతోంది.  కుట్రను ప్రజలు విశ్వసించలేదు. చంద్రబాబు బూటకపు హామీలను నమ్మి మోసపోయామని ప్రజలు ఇప్పుడు చింతిస్తున్నారు.  రాబోయే ఎన్నికల్లో  వైఎస్సార్ కాంగ్రెస్‌ను గెలిపించి వై.ఎస్. జగన్‌ను సీఎం చేయాలని ప్రజలు నిశ్చయానికి వచ్చేశారు.’  -  గిడ్డి ఈశ్వరి, ఎమ్మెల్యే, పాడేరు
Share this article :

0 comments: