మీ ఫేస్ వ్యాల్యూ ఏంటో... వాళ్లే చెబుతారు: రోజా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మీ ఫేస్ వ్యాల్యూ ఏంటో... వాళ్లే చెబుతారు: రోజా

మీ ఫేస్ వ్యాల్యూ ఏంటో... వాళ్లే చెబుతారు: రోజా

Written By news on Wednesday, February 24, 2016 | 2/24/2016


మీ ఫేస్ వ్యాల్యూ ఏంటో... వాళ్లే చెబుతారు: రోజా
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేశ్ పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా నిప్పులు చెరిగారు. బుధవారం విశాఖపట్నంలో రోజా విలేకర్లలో మాట్లాడుతూ... నమ్మినవారిని నట్టేట ముంచడమే నారా వారి సిద్ధాంతం అని ఆరోపించారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ను దెబ్బకొట్టాలనే దృష్టి తప్ప చంద్రబాబుకు పాలనపై శ్రద్ధే లేదని విమర్శించారు. పార్టీ కోసం ప్రాణాలొదిలిన కుటుంబాలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారన్నారు.
అలాగే ఓట్లు వేసిన ప్రజలను కూడా చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని రోజా ఈ సందర్భంగా గుర్తు చేశారు. తండ్రి అధికారంలో ఉన్నారని వానపాములాంటి లోకేశ్ నేడు నాగుపాములా బుసకొడుతున్నారని ఆమె ఎద్దేవా చేశారు. లోకేశ్ వైఖరి చూస్తుంటే ఆశ్చర్యమేస్తుందని,   లోకేశ్ అవాకులు, చెవాకులతోనే తెలంగాణలో టీడీపీ ఖాళీ అయిందని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఏపీలో కూడా లోకేశ్ కి బాధ్యతలు అప్పగిస్తే .. మన పరిస్థితి ఏంటని టీడీపీ నేతలు భయపడుతున్నారన్నారు.
చంద్రబాబులాంటి దిక్కుమాలిన ఆలోచనలు తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కు లేవని రోజా అన్నారు. గతంలో ఎన్టీఆర్ లాంటి మహానుభావుడిని  ముఖ్యమంత్రి కుర్చీ నుంచి కిందకి దింపే వ్యవహారం... ఒక వేళ జగన్ చేస్తే మీరు ఒక్క రోజు కూడా అధికారంలో ఉండేవారు కాదని ఆమె అన్నారు. దమ్ముంటే ఎంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలనైనా తీసుకెళ్లవచ్చని... అయితే సిగ్గు, అభిమానం అనేది ఉంటే.. పార్టీ మారినవారితో రాజీనామా చేయించి  మళ్లీ ఎన్నికల్లో  పోటీ చేయాలని రోజా సవాల్ విసిరారు. మీ ఫేస్ వ్యాల్యూ ఏంటో...  మీరు చేసిన అభివృద్ధి ఏంటో ప్రజలే చెబుతారంటూ రోజా ధ్వజమెత్తారు.
Share this article :

0 comments: