విజయనగరం: పార్టీ మారుతారన్నట్లు వచ్చిన వార్తలను సాలూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజన్న దొర తీవ్రంగా ఖండించారు. కొన్ని ఛానళ్లు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము వైఎస్ జగన్ మోహన్ రెడ్డితోనే ఉంటామని చెప్పారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకే టీడీపీ నేతలు మైండ్ గేమ్ ఆడుతున్నారని ఆయన ఆరోపించారు. అవినీతిని కప్పి పుచ్చుకునేందుకే టీడీపీ నేతలు ఫిరాయింపులకు పాల్పడుతున్నారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం తప్పుడు ప్రచారాలను మానుకోవాలని రాజన్నదొర హెచ్చరించారు.
Home »
» మేం వైఎస్ జగన్ తోనే ఉంటాం
మేం వైఎస్ జగన్ తోనే ఉంటాం
Written By news on Monday, February 22, 2016 | 2/22/2016
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment