
గ్రామాల్లో తిరిగే ధైర్యం ఇప్పుడు చంద్రబాబుకు లేదు. రుణమాఫీలపై రైతులు నిలదీస్తున్నారు. వడ్డీలు కూడా మాఫీ కావడం లేదని రైతులు ఆగ్రహంతో ఉన్నారు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం కూడా రాలేదని మండిపడుతున్నారు. డ్వాక్రా మహిళలు కూడా చంద్రబాబును మోసగాడు అంటున్నారు. రుణాలు మాఫీ కాలేదు సరికదా, రెండు రూపాయిలు వడ్డీ చెల్లించాల్సి వస్తోందని ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విషయమే చంద్రబాబు మరిచిపోయారు. నిరుద్యోగులకు భృతి కూడా ఇవ్వలేదు. సగంలో నిలిచిపోయిన ఇళ్లకు చెల్లింపులు కూడా చేయలేదు. కరెంటు బిల్లుల షాక్ లు కొడుతున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు తారాస్థాయికి చేరాయి.
చంద్రబాబును జనం తిట్టుకుంటున్నారు. మున్సిపాల్టీల్లో పన్నులు డబుల్ చేశారు. చంద్రబాబు ప్రజల గొంతుల్ని నొక్కే కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఆయనకు ఇన్ని డబ్బులు ఎక్కడ నుంచి వస్తున్నాయి. ఒక్కో ఎమ్మెల్యేకు కోట్లాది రూపాయలతో ప్రలోభపెడుతున్నారు. నన్ను తప్ప మిగతా ఎమ్మెల్యేలకు రోజూ ఫోన్లు కొడుతున్నారు. ఇన్ని డబ్బులు ఆఫర్ చేసినా...ప్రలోభాలకు లొంగని ఎమ్మెల్యేలకు హ్యాట్సాఫ్ చెప్తున్నా. ప్రజల తరఫున పోరాటం చేయడానికి మా ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారు. అన్నివర్గాల వారికి మా ఎమ్మెల్యేలు అండగా ఉంటున్నారు. మళ్లీ పదవిలోకి రావాలంటే చిట్కా.. ఎమ్మెల్యేలను లాక్కోవడం కాదు. ప్రజల గుండెల్లో నిలబడ్డమే.. మళ్లీ అధికారంలోకి రావడానికి చిట్కా. ఎమ్మెల్యేల కొనుగోలుతో పని కాదని చంద్రబాబు గుర్తించాలి. ఇంత ఒత్తిడి చేసినా ఐదుగురు ఎమ్మెల్యేలను మాత్రమే తీసుకెళ్లారు. వేరే పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను తీసుకోవడమేంటి? వారిని అనర్హతకు గురి చేయరట? రాజీనామాలు తీసుకోరంట?. చంద్రబాబు వేసే ఎత్తుగడల మాదిరిగా టీవీ ఛానళ్లు వార్తలు ఇస్తున్నాయి. టీవీ ఛానళ్లు పేర్లు వేయడం, దీనికి మా ఎమ్మెల్యేలు ఖండనలు ఇవ్వడం. ఇలా ఎన్నిరోజులు. ఏం తీరు ఇది.
ఇంతమందిని లాక్కునే శక్తి చంద్రబాబుకు ఉంటే ఐదుగురుతో ఎందుకు ఆగారు? ఆయనపై ప్రజలకు నమ్మకం, విశ్వాసం ఎవ్వరికీ లేవు. మునిగిపోయే పడవ ఎక్కడానికి ఎవ్వరూ సిద్ధంగా లేదు. టీవీ ఛానళ్లలో వచ్చే తప్పుడు వార్తల వల్ల, ఎమ్మెల్యేలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎమ్మెల్యేల నిజంగా వెళితే, ఏమైనా రాసినా అర్థం ఉంటుంది. వెళ్లనివాళ్లను కూడా టార్గెట్ చేసి వార్తలు రాయడం సరికాదు. నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యేలు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. మీడియా కూడా సంయమనంతో వ్యవహరించాలి.' అని సూచించారు.
0 comments:
Post a Comment